BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న ఇచ్చిన తీర్పుపై తాజాగా నేడు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు అయింది. సింగిల్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటీషన్ ను అడ్వకేట్ జనరల్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ తీర్పు ఆర్డర్ సస్పెన్షన్ ను 3 వారాల పాటు పొడిగించాలని ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో లంచ్ మోషన్ ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ లంచ్ మోషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఈ కేసు సిట్ కాకుండా సీబీఐ విచారణ జరపాలని నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
నిన్న డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో బెంచ్ తీర్పు ఆర్డర్ సస్పెన్షన్ పై మరికొన్ని రోజులు గడువు కావాలని ఏజీ కోరారు. అయితే ఇందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీనితో ప్రభుత్వం వీలైనంత తొందరగా సిట్ తో సుప్రీంకోర్టులో పిటీషన్ వేయించాలని చూసింది. అయితే నేడు హైకోర్టు అనూహ్యంగా లంచ్ మోషన్ పిటీషన్ ను స్వీకరించింది. ఈ పిటీషన్ పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. మరి సింగిల్ బెంచ్ లో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై విచారణ జరిపిన కోర్టు నిన్న కీలక తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని అంతా భావించగా..లంచ్ మోషన్ కు హైకోర్టు అనుమతించడంతో ఏజీ పిటీషన్ దాఖలు చేశారు.
ఇక మధ్యాహ్నం విచారణ అనంతరం సింగిల్ బెంచ్ లో ఈ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Highcourt, Telangana, Telangana News, TRS MLAs Poaching Case