కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా నుంచి మనకి మనం రక్షించుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని మొదటి నుంచి వైద్యులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా వేగవంతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. కరోనాను నియంత్రించే విషయంలో మరొ ముందడగు పడింది. ఈ మహమ్మారికి త్వరలోనే మరో మందు అందుబాటులోకి రానుంది. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ అంటే నాజల్ వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనిని భారత్ బయోటెక్ నిర్మించింది. అయితే మరో దశ క్లినికల్ ట్రయల్స్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయస్సుల వారిపై నిర్వహించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయినట్లు తెలిపింది. తదుపరి రెండు, మూడు దశల్లో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కు కూడా కేంద్రం అనుమతినిచ్చినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ వెల్లడించింది. ఇప్పటికే భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కొవాగ్జిన్’టీకాను చాలామంది తీసుకున్నారు.
అయితే ఇదే సంస్థ ఇప్పుడు ముక్కు ద్వారా ఇచ్చే టీకా (బీబీవీ154- అడెనోవైరస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్) అభివృద్ధిపై ఫోకస్ చేసింది. దేశంలో నాలుగు ప్రధాన నగరాల్లో దీని మొదటి దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించినట్లు భారత్ బయోటెక్ ప్రతినిధులు తెలిపారు. ఇందు కోసం గతేడాది సెప్టెంబరులో భారత్ బయోటెక్, యూఎస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Read Also: బ్యాంకుగా మారనున్న ప్రముఖ సంస్థ.. రూపే క్రెడిట్ కార్డు సేవలు ప్రారంభం.. వివరాలివే..
అయితే ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని.. ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ తయారు చేయలేదు. మొదటి సారిగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Biotech, Corona Vaccine