హోమ్ /వార్తలు /తెలంగాణ /

Be alert : సెకండ్ వేవ్‌లో 95శాతం పాజిటివ్ రోగులు ఆసుపత్రిపాలు..మొదటి కంటే తీవ్రం

Be alert : సెకండ్ వేవ్‌లో 95శాతం పాజిటివ్ రోగులు ఆసుపత్రిపాలు..మొదటి కంటే తీవ్రం

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

Be alert : కరోనా మొదటి వేవ్ కంటే రెండవసారి వస్తున్న కరోనా చాల ప్రమాదకరంగా తయారైందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు..ఫస్ట్ వేవ్‌కు, సెకండ్ వేవ్‌ చాల ప్రమాదకరంగా ఉందని చెప్పారు


కరోనా మొదటి వేవ్ కంటే రెండవసారి వస్తున్న కరోనా చాల ప్రమాదకరంగా తయారైందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు..ఫస్ట్ వేవ్‌కు, సెకండ్ వేవ్‌కు మధ్య చాల తేడా ఉందని చెప్పారు. కాగా అప్పుడు 20 శాతం మంది రోగులు ఆసుపత్రుల్లో చేరితే సెకండ్ వేవ్ లో 95శాతం మంది ఆసుపత్రిలో చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంలో వైద్యులు ఇతర సిబ్బంది ఎలాంటీ ధర్నాలకు వెళ్లవద్దని విజ్ఝప్తి చేశారు. ఇదే సంధర్భంలో పది పడకల ఆసుపత్రికి కూడ కోవిడ్ సేవలు అందించేకు అనుమతి ఇచ్చామని చెప్పారు.

కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ అప్రమత్తమైంది. కరోనాకు సంబంధించి ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వార పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉండే విధంగా ఆశా వర్కర్లు ,మరియు ప్రాధమిక కేంద్రాల వైద్యులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రవేటు ఆసుపత్రుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు సూపర్ స్పైషాలిటి ఆసుపత్రుల్లో మాత్రమే కరోనాకు చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం పది పడకల ఆసుత్రులకు కూడ కరోనా చికిత్స చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

మరోవైపు రాష్ట్ర్ర వ్యాప్తంగా మొత్తం 47 వేల బెడ్లు పలు ఆసుపత్రుల్లో ఉండగా వాటిలో సగానికి పైగా కోవిడ్ పేషంట్ల కోసమే వాడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైరస్ బారిన పడినవారు గతంతో పోల్చితే భారిగా పెరిగారని అన్నారు. మొదటి వేవ్ లో 20 శాతమే ఆసుపత్రుల్లో చేరితే...సెకండ్ వేవ్ లో 90 శాతం మంది రోగులు ఆసుపత్రుల్లో చేరుతన్నారని అన్నారు. దీంతో వైద్యులు సరైన చర్యలు  చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా కొవిడ్ భాదితులకు కావల్సిన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ కొవిడ్ తో చనిపోయిన వారి మృత దేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు స్థానిక మున్సిపల్ అధికారులు , గ్రామాల్లో పంచాయితి అధికారులు సమన్యయం చేసుకుని అప్పగించాలని ఆయన సూచించారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Corona cases, Etela rajender, Hyderabad

ఉత్తమ కథలు