Home /News /telangana /

HYDERABAD BE ALERT ALL THE PUBLIC REPRESENTATIVES AND OFFICIALS SAYS CM KCR VRY

cm kcr : ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు..అప్రమత్తంగా ఉండండి..ఇళ్ల నుండి బయటికి రాకండి..

'సీఎం కేసీఆర్ హెచ్చరిక

'సీఎం కేసీఆర్ హెచ్చరిక

cm kcr :వర్షాలతో క‌ృష్ణా,గోదావరి నదుల ప్రాజేక్టుల గేట్లు ఎత్తనుండడంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షంచాలని సీఎం కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

    తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో, ఆయా రాష్ట్రాల అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో.. వరద ఉదృతి పెరగనున్నదని నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిల లోని టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలని సూచించారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు.

    ఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా బయటకు వెల్లకుండా ఇండ్లల్లో వుండడమే క్షేమమని సిఎం పునరుద్ఘాటించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎవరి జాగ్రత్తలు వాల్లు తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులందరూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాలతో పాటు ఇతర ిజిల్లాల్లో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి.వీటితోపాటు హైదరాబాద్ నగరం కూడా వర్షాలతో జనజీవనం స్థంబించిపోయింది
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Heavy Rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు