హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bathukamma sarees : ఉచితంగా పంపిణికి సిద్ధంగా ఉన్న కోటి 10లక్షల బతుకమ్మ చీరలు .. ఎప్పటి నుంచి ఇస్తారంటే

Bathukamma sarees : ఉచితంగా పంపిణికి సిద్ధంగా ఉన్న కోటి 10లక్షల బతుకమ్మ చీరలు .. ఎప్పటి నుంచి ఇస్తారంటే

(bathukamma sarees)

(bathukamma sarees)

Bathukamma sarees: తెలంగాణలో దసరా పండుగకు ముందు బతుకమ్మ పండుగ జరుపుకోవడం రాష్ట్ర ప్రజల సాంప్రదాయం. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగలా నిర్వహిస్తూ వస్తోంది. రాష్ట్రంలోని మహిళలు, ఆడపడుచులకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణి చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana)లో దసరా పండుగకు ముందు బతుకమ్మ పండుగ జరుపుకోవడం రాష్ట్ర ప్రజల సాంప్రదాయం. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగలా నిర్వహిస్తూ వస్తోంది. రాష్ట్రంలోని మహిళలు, ఆడపడుచులకు పండుగ కానుకగా బతుకమ్మ చీరల(Bathukamma sarees)ను పంపిణి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా అందజేసేందుకు కోటి 10లక్షల చీరల(Crore 10 lakh sarees)ను ప్రభుత్వం తయారు చేయించింది. వచ్చే నెలలో అందరికి అందజేసేందుకు అన్నీ జిల్లా కేంద్రాలకు తరలిస్తోంది. ఈసారి బతుకమ్మ చీరల స్పెషాలిటీ(sarees specialty)ఏమిటో తెలుసా.

Jubilee hills gang rape case| KTR: జూబ్లీహిల్స్​ గ్యాంగ్​ రేప్​​ కేసులో నిందితులకు బెయిల్​పై స్పందించిన మంత్రి కేటీఆర్బతుకమ్మ చీరలు రెడీ..

తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఏటా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్రంలోని ఆడపడుచులు, మహిళలకు ఉచిత కానుకగా బతుకమ్మ చీరలను పంపిణి చేస్తూ వస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోటి చీరల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 17 నుంచి వీటిని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 1.10 కోట్ల చీరలను ఈ నెల 22 నుంచి జిల్లాలకు చేరవేసేందుకు రాష్ట్ర చేనేత సహకార సంస్థ సన్నాహాలు ప్రారంభించింది.

కోటి 10లక్షల చీరలు ..

ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు నాణ్యత లేవని గతేడాది విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈసారి సరికొత్తగా 17 రంగులు,17 డిజైన్లతో కలిపి మొత్తం 289 రంగులతో బతుకమ్మ చీరలను రూపొందించారు. అంతే కాదు ఈసారి చీరలకు డాబీ అంచు ఉండేలా నేయించారు. సుమారు కోటిపైగా తయారు చేసిన బతుకమ్మ చీరలను ఈ నెల నాలుగో వారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తారు. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ పండుగ ఉంది. అంతకంటే నాలుగు రోజుల ముందే పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించింది.

18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి..

గతంలో మాదిరిగానే 18 ఏళ్లు దాటిన నిరుపేద మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు. తెలంగాణ మహిళల పండుగైన బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.ఈ ఏడాది పథకానికి రూ.333 కోట్లు కేటాయించింది. గతంలోకంటే వేగంగా ఈ ఏడాది పంపిణీ చేపట్టేందుకు జనవరిలోనే తయారీని ప్రారంభించింది. ప్రతి నెలా పది లక్షల చొప్పున ఇప్పటివరకు 90 లక్షల చీరలను తయారు చేశారు. మరో నాలుగురోజుల్లో 20 లక్షల చీరలు ఉత్పత్తి కానున్నాయి. సిరిసిల్లలోని 16 వేల మంది నేత కార్మికులకు ఈ బతుకమ్మ చీరలను నేచే పనులను అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.

Arogya sri: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్​కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. వివరాలివే15012 కేంద్రాల ద్వారా పంపిణి..

అందరికి సంపూర్ణంగా అందజేయాలనే సంకల్పంతోనే బతుకమ్మ చీరలను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు,పురపాలక వార్డులు,నగరపాలక డివిజన్ల వారిగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.గ్రామాల్లో రేషన్‌ డీలరు, పంచాయతీ కార్యదర్శి,మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీలు,నగరాలు, పట్టణాల్లో రేషన్‌ డీలరు,పురపాలక బిల్‌ కలెక్టర్‌,మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతాయి. గతేడాది వరంగల్‌ జిల్లాలోని టెస్కో గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుజాగ్రత్తగా అన్ని గోదాముల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మండలస్థాయి గోదాముల వద్ద సైతం జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Bathukamma, Telangana News

ఉత్తమ కథలు