Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీపై కీలక ప్రకటన చేసిన బత్తిని హరినాథ్‌గౌడ్

చేప ప్రసాదం పంపిణీ(ఫైల్ ఫొటో)

ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీనిపై బత్తిని హరినాథ్‌గౌడ్‌ కీలక ప్రకటన చేశారు.

  • Share this:
    ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీనిపై బత్తిని హరినాథ్‌గౌడ్‌ కీలక ప్రకటన చేశారు. క‌రోనా వైర‌స్ ఉధృతి కార‌ణంగా ఈ ఏడాది కూడా చేప ప్ర‌సాదం పంపిణీ నిలిపివేస్తున్న‌ట్లు బ‌త్తిని హ‌రినాథ్ గౌడ్ తెలిపారు. గతేడాది కూడా కరోనా నేపథ్యంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయలేదని అన్నారు. ఈ ఏడాది కూడా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని చెప్పారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సూచ‌న మేర‌కు ఈ ఏడాది కూడా చేప ప్ర‌సాదం పంపిణీ నిలిపివేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఏడాది మృగ‌శిర కార్తె ప్ర‌వేశం రోజున ఆస్త‌మా రోగుల‌కు బత్తిని సోదరులు చేప ప్ర‌సాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

    175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం చేప ప్రసాదాన్ని అందిస్తుందని బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. అయితే ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయకపోయినప్పటికీ.. మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏడాది మాదిరిగానే జూన్‌ 7వ తేదీన దూద్‌బౌలిలోని వారి నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మరుసటి రోజు 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

    చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి దేశ, విదేశాల నుంచి కూడా అస్తమా రోగులు ఇక్కడికి వచ్చేవారని బత్తిని హరినాథ్ గౌడ్ గుర్తుచేశారు. అయితే రెండేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితు దృష్ట్యా.. జనాలు చేప ప్రసాదం కోసం వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్టు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: