Home /News /telangana /

HYDERABAD BANKING WORKING HOURS STARTS AT 8 AM IN TELANGANA VRY

Bank hours : మారిన బ్యాంకు వేళలు ...ఉదయం ఎనిమిది గంటలకే ఓపెన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bank hours : తెలంగాణలో లాక్డౌన్‌తో బ్యాంకు పనివేళలు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 నుండి 10 వరకు సాధారణ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడంతో బ్యాంకు వేళల్లో కూడ మార్పులు జరిగాయి.

లాక్‌డౌన్‌తో బ్యాంకు పని వేళలు మారాయి. తెలంగాణలో నేటి నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలోనే బ్యాంకు పని వేళలు మారనున్నాయి. నేటి వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిన బ్యాంకులు రేపటి నుండి ఉదయం ఎనిమిది గంటల నుండే ప్రారంభం కానున్నాయి. 8 నుండి మధ్యాహ్నం 12 గంటలకు వరకు పని చేయనున్నాయి. కాగా ఇప్పటికే బ్యాంకుల్లో 50 శాతం సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే సాధరణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు కూడ జరిగాయి. దీంతో బ్యాంకులు కూడ తమ పని వేళల్ని మార్చుకున్నాయి.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఇలా లాక్డౌన్ విధించిన మే 20వ తేదీ వరకూ ఇది అమలులో ఉండనుంది.
Published by:yveerash yveerash
First published:

Tags: Bank, Lock down, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు