• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD BANK WORKING HOURS STARTS AT 8 AM FROM TODAY IN TELANGANA VRY

Bank Timings : నేటి నుండి మారిన బ్యాంకు పని వేళలు 8 గంటలకే షురు

Bank  Timings : నేటి నుండి మారిన బ్యాంకు పని వేళలు 8 గంటలకే షురు

8 నుండి 12 గంటల వరకే బ్యాంకులు, నేటి నుండి 10 రోజుల పాటు (ప్రతీకాత్మక చిత్రం)

Bank Timings :తెలంగాణలో లాక్డౌన్‌తో కొనసాగుతుండడంతో బ్యాంకు పనివేళలు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 నుండి 10 వరకు సాధారణ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడంతో బ్యాంకు వేళల్లో కూడ మార్పులు చేసినట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం తెలిపింది.

  • Share this:
లాక్‌డౌన్‌తో బ్యాంకు పని వేళలు మారాయి. తెలంగాణలో బుధవారం నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలోనే బ్యాంకు పని వేళలు మారాయి. నిన్నటి వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిన బ్యాంకులు నేటి నుండి ఉదయం నుండే ప్రారంభం కానున్నాయి. 8 నుండి మధ్యాహ్నం 12 గంటలకు వరకు పని చేయనున్నాయి. కాగా ఇప్పటికే బ్యాంకుల్లో 50 శాతం సిబ్బందితోనే విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు.

తెలంగాణ పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే సాధరణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు కూడ జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆదేశాలు జారీ చేసింది. మారిన పని వేళల్లో అత్యవసర సేవలను మాత్రమే అందించాలని,అన్ని సమావేశాలను సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని కొరింది.ఇక ఏటిఎంలలో డబ్బులు భర్తీ చేసేవారు తప్పని సరిగా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచిందింది.
Published by:yveerash yveerash
First published: