• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD BANK EMPLOYEE RESTRICTED HIS WIFE IN A ROOM IN JAGADGIRIGUTTA SU

Hyderabad: కరోనా సోకిందని భార్యను గదిలో బంధించిన భర్త.. కానీ అసలు కథ వేరే ఉంది..

ప్రతీకాత్మక చిత్రం(Image-Youtube)

ఓ వ్యక్తి కరోనా సోకిందని చెప్పి భార్యను గదిలో బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న పారాలీగల్‌ వాలంటీర్‌ బాధితురాలికి అండగా నిలిచారు.

  • Share this:
    ఓ వ్యక్తి కరోనా సోకిందని చెప్పి భార్యను గదిలో బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న పారాలీగల్‌ వాలంటీర్‌ బాధితురాలికి అండగా నిలిచారు. అయితే ఆ తర్వాత బాధితురాలికి కరోనా సోకలేదని తేలింది. వివరాలు.. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు(8) ఉన్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ వేళ అతని ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని భార్యను ఒత్తిడి తెచ్చాడు. రూ. 6 లక్షలు తీసుకురావాలని వేధించాడు. అయితే పెళ్లి జరిగిన ఇన్నాళ్లకు.. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడంతో డబ్బులు తెచ్చేందుకు అంగీకరించలేదు.

    తాను చెప్పిన మాటలు విననందుకు అతడు భార్యపై కోపాన్ని పెంచుకున్నాడు. ఆమెను చాలా రోజుల పాటు ఇంట్లోని ఓ గదిలో బంధించాడు. చుట్టుపక్కల వాళ్ల ఆమె గురించి అడిగితే.. కరోనా సోకిందని అబద్ధం చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఒకరు సనత్‌నగర్‌లోని న్యాయసేవా విభాగానికి చెందిన పుష్పలతకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆమె.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు విముక్తి కల్పించారు.

    ఇవి కూడా చదవండి: వేరే కులం వ్యక్తిని ప్రేమించిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు..

    TV Actress Arrest: ప్రముఖ టీవీ షోలలో నటిస్తున్న ఇద్దరు నటీమణుల అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించాక..

    అనంతరం ఆమెకు కరోనా పరీక్షలు చేయించగా.. నెగిటివ్‌ వచ్చింది. తర్వాత ఆమెను పుట్టింటికి పంపారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు భర్తపై కోర్టును, పోలీసులను ఆశ్రయించారు. కోర్టు సూచనతో అధికారులు బాధితురాలు భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక, చివరకు అతను తప్పు సరిదిద్దుకుని పుట్టింట్లో ఉన్న భార్యను కాపురానికి తీసుకెళ్లాడు.
    Published by:Sumanth Kanukula
    First published: