హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర .. నిందితుడి నుంచి పిస్టోల్, కత్తి స్వాధీనం

Hyderabad : టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర .. నిందితుడి నుంచి పిస్టోల్, కత్తి స్వాధీనం

Jeevanreddy(file)

Jeevanreddy(file)

HYD | Crime news: తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని హత్య చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హత్య కుట్రకు కారణాలు రాబడుతున్నారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ(Telangana)లోని అధికార పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడి(TRS MLA)పై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్Nizamabad జిల్లా ఆర్మూర్Armor టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి(Jeevan Reddy )ని హత్య చేయడానికి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ వేమూరి ఎన్‌క్లేవ్‌లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అనుమానించారు. అతడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి రెండు పిస్టోళ్లు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

కక్ష పెట్టుకొని మర్డర్‌ ప్లాన్..

నిందితుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వాడిగా గుర్తించారు బంజారాహిల్స్ పోలీసులు. నిందితుడు కిల్లెడ గ్రామ మాజీ సర్పంచ్‌ భర్తగా నిర్ధారించారు. అతడ్ని విచారించిన పోలీసులు తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశారనే కక్షతోనే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నట్లుగా తెలిపాడు. అందులో భాగగానే జీవన్‌రెడ్డిని హత్య చేయడానికి ఇంటి దగ్గర తచ్చట్లాడుతుండగా పట్టుకున్నారు.

First published:

Tags: Jeevan reddy, Telangana News, TRS leaders

ఉత్తమ కథలు