హోమ్ /వార్తలు /తెలంగాణ /

Balapur laddu : బాలాపూర్‌ లడ్డూ ప్రసాదం వేలం మొదలు .. ఈసారి 20లక్షలు దాటే ఛాన్స్

Balapur laddu : బాలాపూర్‌ లడ్డూ ప్రసాదం వేలం మొదలు .. ఈసారి 20లక్షలు దాటే ఛాన్స్

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Hyderabad: అందరి దృష్టి ఇప్పుడు బాలాపూర్‌ లడ్డూ వేలంపైనే ఉంది. గతేడాది 18.90లక్షలు పలికిన వినాయకుడి మహాప్రసాదం ఈసారి ఎంత పలుకుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఉత్సవ కమిటీ నిర్వాహకుల మాత్రం 210లక్షలు దాటే ఛాన్సు ఉందని భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో ఏటా నిర్వహించే గణేష్ చవితి నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఖైరతాబాద్‌ (Khairatabad)భారీ గణనాథుడి శోభయాత్రతో పాటుగా బాలాపూర్‌ లడ్డూ(Balapur laddu)ప్రసాదం వేలం అందరికి ఆసక్తిని కలిగించే అంశాలు. ఆనవాయితీలో భాగంగా శుక్రవారం (Friday)గణేష్ నిమజ్జనాలు ఉండటంతో బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రారంభం కానుంది. ఈసారి వేలంలో మొత్తం 9మంది సభ్యులు పాల్గొననున్నారు. ముగ్గురు స్థానికులు ఉండగా ...ఆరుగురు స్థానికేతరులు లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 1994నుంచి గతేడాది వరకు అంటే 28సంవత్సరాల్లో లడ్డూ వేలం ద్వారానే బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాది 18.9లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ ప్రసాదం ధర ..ఈసారి వేలంలో ఇంకా పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

Telangana : ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అధికారుల బంధువులకే .. భర్తీ పేరుతో భారీ స్కాంబాలాపూల్‌ లడ్డూ వేలం..
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో జరిగే వినాయకచవితి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం బాగా ఫేమస్ అని చెప్పాలి. సిటీలో ఏటా కొన్ని వేలాది విగ్రహాలు ప్రతిష్టించి నిమజ్జనం చేస్తారు. కాని బాలాపూర్‌ గణేష్ ఉత్సవ కమిటీ మాత్రమే లడ్డూ వేలం వేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా అదే స్థాయిలో గణనాథుడి లడ్డూ వేలం ఉదయం 9గంటలకు ప్రారంభం అవుతుంది. ఈసారి లడ్డూ వేలంలో 9మంది సభ్యులు పాల్గొంటున్నారు. గతేడాది అంటే 2021లో 18.90లక్షలు పలికిన లడ్డూ ధర ..ఈసారి ఇరవై లక్షలు దాటే ఛాన్సు ఉందని కమిటీ సభ్యులు చెబుతున్నారు.


పోటీలో 9మంది అభ్యర్ధులు..
ఇప్పటి వరకు 28ఏళ్లుగా బాలాపూర్‌ లడ్డూని వేలం వేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్థితుల దృష్ట్య గతేడాది కాస్త తక్కువ ధర పలికినప్పటికి ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వేలం జరుగుతుందనే టాక్ ఉంది. మొట్టమొదటి సారిగా 1994 నుంచి బాలాపూర్‌లో గణేష్‌ లడ్డూ వేలంపాట కొనసాగూ వస్తోంది. బాలాపూర్‌ లడ్డూ వేలంపాట మొదట రూ.450తో ప్రారంభమైంది. ఉదయం 9గంటలకు బాలాపూర్‌ లడ్డూ ప్రసాదం వేలం మొదలవుతుంది. అది పూర్తవగానే గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది.
ఈసారి 20లక్షలు దాటే ఛాన్స్..
బాలాపూర్ వినాయకుడికి 42 ఏళ్ల చరిత్ర ఉన్నా.. లడ్డూ వేలం మాత్రం 1994 నుంచి కొనసాగుతూ వస్తోంది. ఆ ఏడాది బాలాపూర్ కు చెందిన కొలను మోహన్‌రెడ్డి కేవలం 450 రూపాయలకు వేలం పాట ద్వారా లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత 1995లో 4 వేల 500 లకు మళ్లీ ఆయనే అందుకున్నారు. ఆ తర్వాత కొలను కృష్ణారెడ్డి 1996 లో 18 వేలకు, 1997 లో 28 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 1998 లో మళ్లీ కొలను మోహన్‌రెడ్డి 51 వేలకు వేలం పాట పాడారు. 1999లో కల్లెం ప్రతాప్‌రెడ్డి 65 వేలకు దక్కించుకున్నారు. 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు వేలం పాట జరగగా.. 2002లో తొలిసారి వేలం పాట లక్ష దాటింది. కందాడ మాధవరెడ్డి లక్షా 5 వేలకు లడ్డూను అందుకున్నారు.

Telangana : సెంట్రల్ విస్టాలో ఖమ్మం బ్లాక్ గ్రానైట్ .. భారీ విగ్రహంతో భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు28ఏళ్లుగా కొనసాగుతున్న వేలం ..
2003లో చిగురంత తిరుపతిరెడ్డి లక్షా 55 వేలకు, 2004లో మరోసారి కొలను మోహన్ రెడ్డి 2 లక్షల ఒక వేయికి లడ్డూను అందుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2 లక్షల 8 వేలకు, 2006లో చిగురంత తిరుపతి రెడ్డి 3 లక్షలకు, 2007లో జి.రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు, 2008లో కొలను మోహన్ రెడ్డి 5 లక్షల 7 వేలకు, 2009లో సరిత 5 లక్షల 10 వేలకు లడ్డును వేలంపాటలో దక్కించుకొన్నారు. 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5 లక్షల 35 వేలకు, 2011లో కొలను బ్రదర్స్ 5 లక్షల 45 వేలకు లడ్డును సొంతం చేసుకున్నారు. 2012లో పన్నాల గోవర్థన్ ఏడున్నర లక్షలకు దక్కించుకోగా.. 2013లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి 9 లక్షల 26 వేలకు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి తొమ్మిదిన్నర లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు. 2015లో లడ్డూ ధర తొలిసారి 10 లక్షల దాటింది. కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి 10 లక్షల 32 వేలకు వేలంలో లడ్డూపు సొంతం చేసుకున్నారు. 2016లో స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేలకు, 2017లో నాగం తిరుపతి రెడ్డి వేలంలో 15 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2018లో శ్రీనివాస్‌ గుప్తా 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2019లో కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Ganesh Chaturthi​ 2022, Telangana News

ఉత్తమ కథలు