హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: 'పఠాన్' థియేటర్ల వద్ద రచ్చ.. హైదరాబాద్‌లో బజరంగ్‌దళ్ ఆందోళనలు

Hyderabad: 'పఠాన్' థియేటర్ల వద్ద రచ్చ.. హైదరాబాద్‌లో బజరంగ్‌దళ్ ఆందోళనలు

Hyderabad: 'పఠాన్' థియేటర్ల వద్ద రచ్చ.. హైదరాబాద్‌లో బజరంగ్‌దళ్ ఆందోళనలు

Hyderabad:  పఠాన్ సినిమాలో షారూఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరు చేసిన రొమాంటిక్ సాంగ్ బే షరమ్‌పైనే ఆగ్రహం జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమాలో దేశభక్తి అంశాలు ఉండడంతో.. పలువురు మాత్రం సమర్థిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

షారూక్ ఖాన్ (Sharukh Khan Movie) మూవీ పఠాన్‌ (Pathan Movie)పై దుమారం కొనసాగుతోంది. బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ  పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా చోట్ల మంచి ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. ఐతే బేషరమ్ సాంగ్‌పై ముందు నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు.. ఇప్పుడు సినిమా విడుదల సందర్భంగానూ ఆందోళనలు చేస్తున్నాయి. మూవీని ప్రదర్శిస్తూ ఊరుకునేది లేదని థియేటర్ల యాజమాన్ని బెదిరిస్తున్నాయి. బుధవారం బీహార్‌లో పలు చోట్ల ఆందోళనలు జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్‌ (Hyderabad)లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

గురువారం హైదరాబాద్‌లోని కాచిగూడలో బజ్‌రంగ్ దళ్ నాయకులు ఆందోళనలు చేశారు. పఠాన్ సినిమాను ప్రదర్శిస్తున్న తారకరామ, ఐనాక్స్ థియేటర్ల ముందు ధర్నాకు దిగారు.  వందల సంఖ్యలో వచ్చిన నాయకులు థియేటర్‌పై దాడి చేశారు. పఠాన్ సినిమా పోస్టర్ లను చించి వేసి... సినిమా నిలిపి వేయాలంటూ నినాదాలు చేశారు.  దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భజరంగ్ దళ్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బుధవారం కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి.  బీహార్‌ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లోని సినిమా హాలులో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు చింపి తగులబెట్టారు. భాగల్‌పూర్‌లోని దీప్‌ప్రభ సినిమా హాల్‌లో షారూఖ్‌ఖాన్ ‘పఠాన్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ విషయం తెలుసుకున్నపలు హిందూ సంస్థల యువకులు సినిమా హాలులోకి ప్రవేశించి.. ఆందోళన చేశారు. పఠాన్ పోస్టర్లను చించి, దహనం చేశారు. ‘‘ఫిల్మ్ చలేగా హాల్ జలేగా’’ అంటూ నినాదాలు చేస్తూ పోస్టర్లకు నిప్పంటించారు. తాము హిందూత్వం విషయంలో రాజీపడబోమని, సనాతన సంస్కృతిని వ్యతిరేకించే ఏ అంశాన్ని సహించబోమని హిందూ సంస్థల కార్యకర్తలు హెచ్చరించారు.

‘‘బేషరమ్ రంగ్’’ పాట విడుదలైన తర్వాత పఠాన్ సినిమా వివాదంలో పడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా .. 'బేషరమ్ రంగ్ ' పాటలో హీరోయిన్ డ్రెస్‌పై తీవ్రం అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది.   అనంతరం అనేక హిందూ సంఘాలు  దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.  విశ్వహిందూ పరిషత్ (VHP)లో భాగమైన భజరంగ్ దళ్ సభ్యులు సైతం మండిపడ్డారు.  సినిమా ప్రమోషన్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని వస్త్రపూర్‌లోని ఆల్ఫా వన్ మాల్‌లో రచ్చ సృష్టించారు. మూవీని విడుదల చేస్తే మరింత ఉధృతంగా నిరసనలు తెలుపుతామని ఆందోళనకారులు బెదిరించారు.

పఠాన్ సినిమాలో షారూఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరు చేసిన రొమాంటిక్ సాంగ్ బే షరమ్‌పైనే ఆగ్రహం జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమాలో దేశభక్తి అంశాలు ఉండడంతో.. పలువురు మాత్రం సమర్థిస్తున్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలని చెబుతున్నారు. అంతేకాదు సినిమాకు హిట్ టాక్ రావడంతో.. థియేటర్లు కూడా నిండిపోతున్నాయి.

First published:

Tags: Hyderabad, Local News, Pathan, Telangana

ఉత్తమ కథలు