Electric Vehicle: హైదరాబాద్ లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి బుకింగ్స్ ఓపెన్.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Electric Vehicel: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్​ను మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను తాజాగా చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు నగరాల్లో కూడా వీటికి బుకింగ్స్​ ఓపెన్​ చేసింది.

  • Share this:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ చేతక్ (Bajaj Chetak) స్కూటర్​ను మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను తాజాగా చెన్నై(Chennai), హైదరాబాద్‌(Hyderabad) నగరాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు నగరాల్లో కూడా వీటికి బుకింగ్స్(Bookings)​ ఓపెన్​ చేసింది. బజాజ్(Bajaj)​ ఆటో ఇప్పటికే తమ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను పూణె(Pune), నాగ్​పూర్(Nagpur)​, బెంగళూరు(Bengalore), ఔరంగాబాద్​, మైసూర్​, మంగళూరు నగరాల్లో విక్రయిస్తోంది. ఇప్పుడు వీటి సరసన హైదరాబాద్‌, చెన్నై నగరాలు కూడా చేరాయి. బజాజ్​ కొత్తగా హైదరాబాద్​లోని కూకట్‌పల్లి, కాచిగూడ ప్రాంతాల్లో కొత్తగా రిటైల్ అవుట్‌లెట్లను ప్రారంభించింది. మరోవైపు చెన్నైలోని కొళత్తూరు, అన్నా సలైలో కూడా రెండు కొత్త రిటైల్ అవుట్‌లెట్లను ఓపెన్​ చేసింది.

వాహన కొనుగోలుదారులకు గుడ్​న్యూస్.. ఆ సంస్థ వాహనాల కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. వివరాలివే.. 


2022 చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను 22 భారతీయ నగరాల్లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నగరాల్లో బజాజ్​ చేతక్​ ఈవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్​సైట్​ లేదా అధికారిక డీలర్​షిప్​ సెంటర్ల ద్వారా బుక్​ చేసుకోవచ్చు. వెబ్​సైట్​ నుంచి బుక్​ చేసుకోవడానికి, కస్టమర్లు తమ మొబైల్​ నంబర్​ను పొందుపర్చాల్సి ఉంటుంది.

తర్వాత సదరు మొబైల్​ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా కస్టమర్లు బుకింగ్​ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కస్టమర్​ తనకు నచ్చిన స్కూటర్​ నగరం, డీలర్​షిప్​ సెంటర్​, వేరియంట్​, కలర్​ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అనంతరం రూ. 2000 టోకెన్​ అడ్వాన్స్​ చెల్లించి బుక్​ చేసుకోవచ్చు. ఈ బుకింగ్స్​ను పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంచింది.

స్నేహితుల పుట్టినరోజును గుర్తు చేసే అద్భుతమైన ఫీచర్​ వచ్చేసింది.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి..


ఈ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్​..
బజాజ్ చేతక్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్‌ ద్వారా పనిచేస్తుంది. ఇది 5 హెచ్​పీ పవర్, 16.2 ఎన్​ఎమ్​ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్​ 3 Kwh లిథియం- అయాన్ బ్యాటరీతో తయారైంది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్‌ చేస్తే చాలు ఎకో మోడ్‌లో 90 కి.మీ. వరకు నడుస్తుందని బజాజ్ పేర్కొంది.

బజాజ్ చేతక్​ స్కూటర్ల తయారీని నిలిపివేసిన దాదాపు 15 సంవత్సరాల తర్వాత, 2020 జనవరిలో ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్ చేసింది. భారత మార్కెట్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లకు డిమాండ్​ గణనీయంగా పెరుగుతోంది. రాబోయే కాలంలో ఈ డిమాండ్​ మరింత పెరగనుంది. ఇప్పటికే ఈ మార్కెట్​లోకి ఓలా ఎలక్ట్రిక్​, సింపుల్ ఎనర్జీ వంటి కొత్త బ్రాండ్లు ప్రవేశించాయి.
Published by:Veera Babu
First published: