HYDERABAD B TECH STUDENT FROM HYDERABAD DIED DUE TO OVERDOSE OF DRUGS AND ANOTHER EIGHT PEOPLE ARE BEING TREATED AT THE HOSPITAL PRV
Drugs in Hyderabad: డ్రగ్స్ తీసుకుంటూ బీటెక్ యువకుడి మృతి.. చికిత్స పొందుతున్న మరో ఎనిమిది మంది..
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లో (Hyderabad) డ్రగ్స్‌కు (drugs) యువకుడు బలయ్యాడు. నగరానికి చెందిన బీటెక్ విద్యార్ధి (btech student) ఒకరు గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజులకే తీవ్ర అస్వస్థతకు గురై సదరు విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్‌లో (Hyderabad) డ్రగ్స్‌కు (drugs) యువకుడు బలయ్యాడు. ఇటీవలె నగరానికి చెందిన బీటెక్ విద్యార్ధి (B.tech student) ఒకరు గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకున్నాడు. ఈ క్రమంలో వారం రోజులకే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలిసి ఆసుపత్రిలో చేర్చించగా సదరు విద్యార్ధి ఎనిమిది రోజులు చికిత్స పొంది ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ (Drugs in Hyderabad) కారణంగా మరణించిన తొలి కేసుగా నిలిచింది. అయితే అందుతున్న సమాచారం మేరకు బీటెక్ విద్యార్థితో పాటు గోవాకు మరో ఎనిమిది మంది వెళ్లినట్లు తెలిసింది. ఇందులో నలుగురు విద్యార్థులు, ఐదుగురు డీజేలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తొమ్మిది మంది కూడా డ్రగ్స్ తీసుకోవడంతో వీళ్లందరినీ ఆసుపత్రిలో చేర్చించారు అధికారులు.
అయితే అందులో హైదరాబాద్‌కు చెందిన ఈ బీటెక్ విద్యార్థి రోజుకు మూడు సార్లు ఓవర్ డోస్ డ్రగ్స్ (Drugs Overdose) తీసుకోవడంతో అతని పరిస్థితి సీరియస్ అయింది. డ్రగ్స్ తీసుకున్న మొత్తం తొమ్మిది మందికి గత ఎనిమిది రోజులుగా చికిత్స అందిస్తున్నారు. మిగతా ఎనిమిది పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ఈ బీటెక్ విద్యార్థి మాత్రం మృతిచెందాడు. చనిపోయే ముందు ఆస్పత్రిలో ఆ విద్యార్థి విలవిల్లాడుతూ కనిపించాడు.మెదడులో స్ట్రోక్స్ వచ్చి చికిత్స పొందతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గోవా (Goa) నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ (Drugs in Hyderabad)లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ తొమ్మిది మంది బాగోతం వెలుగుచూసింది. అరెస్టయిన నిందితులతో పాటు మృతి చెందిన యువకుడు కూడా డ్రగ్స్ తీసుకుని అమ్మేవాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
గతంలోనే సీఎం సీరియస్..
హైదరాబాద్ (Hyderabad) మహానగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దానితో పాటు పాశ్చాత్య సంస్కృతి కూడా పాతుకుపోతోంది. ఇప్పటికే పబ్‌లు, డ్రగ్స్ హైదరాబాద్‌ను కుదిపేస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ డ్రగ్స్ (Drugs)విషయంపై ఇప్పటికే సీరియస్ (Serious) అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు (To strictly control drug use in Telangana) చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలపై అధికారులతో కొన్ని రోజుల కిందటే చర్చించారు. ఈ మేరకు పోలీసు శాఖ , ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశారు.
ద్విముఖ వ్యూహం..
డ్రగ్స్ ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని (adopt a two-pronged strategy to control drugs) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గతంలోనే ఓ మీటింగ్ పెట్టి అధికారులను ఆదేశించారు. మొదట వ్యూహం లో ఇప్పటికే డ్రగ్స్ అడిక్ట్ అయిన వారిని గుర్తించి, వారిని వారు కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం కోసం తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ తర్వాత.. డ్రగ్స్ (Drugs) వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ ను గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలని సీఎం గతంలోనే సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.