ఈ ‘చిన్ని కృష్ణుడు’కి పెద్ద కష్టం.. ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. సాయం కోసం ఎదురుచూపులు

బాలుడు అయాన్ష్ గుప్తా తో తల్లిదండ్రులు

అయాన్ష్ అనే ఈ బాలుడి చికిత్సకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం. అంత డబ్బు పెట్టే స్థోమత అతడి తల్లిదండ్రులకు లేదు. దీంతో అయాన్ష్ కు సాయం చేసేందుకు ఫండ్ రైగింగ్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు రూ.4.27 కోట్లు సేకరించగలిగారు. సాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

  • Share this:
బుడి బుడి అడుగులతో సందడి చేయాల్సిన చిన్నారి.. ఆసుపత్రి బెడ్​పై అరుదైన వ్యాధితో అల్లాడుతున్నాడు. పది కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధిని నయం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం, దాతలు ఆపన్నహస్తం అందించి తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇంతకీ ఆ చిన్నారికి వచ్చిన ఆ అరుదైన వ్యాధి ఏంటి? వ్యాధి చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

పూర్తి విరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​కు చెందిన యోగేష్ గుప్తా, రూపాల్ గుప్తా దంపతులకు 2018 మే 27న అయాన్ష్​ జన్మించాడు. అయితే, పండంటి మగబిడ్డ తమ కుటుంబంలోకి అడుగుపెట్టాడన్న సంతోషం వారికి ఎక్కువ కాలం నిలువలేదు. అయాన్ష్​ 6 నెలల వయస్సులో ఉండగా.. మిగతా పిల్లల్లా అతడు లేడని, చాలా బలహీనంగా ఉన్నాడని తల్లిదండ్రులు గమనించారు. ఇతర పిల్లల్లా అయాన్ష్​ సరిగ్గా కూర్చోలేకపోవడం, తల్లిపాలు తాగేటప్పుడు అయాన్ష్ మెడ మరొక వైపు పడిపోతుండటం చూసి వారు కంగారు పడ్డారు. దీంతో, రెయిన్​బో చిల్ట్రన్స్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆయాన్ష్​ ఎస్​ఎంఐ (స్పైనల్​ మాస్క్యులర్​ ఆటోఫీ)తో బాధపడుతున్నాడని, ఇది చాలా అరుదైన వ్యాధి అని చెప్పారు. ఈ వ్యాధి వచ్చిన చిన్నారుల జీవిత కాలం 4 నుండి 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, జోల్గెన్​స్మా అనే మందుతో చిన్నారి వ్యాధి నయం చేయవచ్చని స్పష్టం చేశారు. అయితే, 99% మందికి ఈ మెడిసిన్​ కొనగలిగే ఆర్థిక స్థోమత ఉండదని, ఈ మెడిసిన్​ కేవలం అమెరికాలో మాత్రమే అమ్ముడవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.

మీ విరాళాన్ని ఇలా పంపించండి..

కాగా, జోల్గెన్​స్మా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్​. ఈ మందు కొనాలంటే సుమారుగా రూ.16 కోట్ల వరకు ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 6 కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రూపాల్​, యోగేష్​ దంపతులు ఇంత భారీ మొత్తంలో వెచ్చించలేరు. అయాన్ష్​ ఆలనా పాలనా చూసుకోవడానికి రూపాల్ ఇప్పటికే తన ఉద్యోగానికి రిజైన్​ చేసింది. ఇక యోగేశ్ ఒక్కడే కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి. అతడి జీతంతో అంత పెద్ద మొత్తం వెచ్చించి చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో, తమ కుమారున్ని కాపాడుకునేందుకు ఆర్థిక చేయూత అందించాలని దాతలను యోగేష్​ దంపతులు కోరుతున్నారు. అయాన్ష్ ప్రాణాలను కాపాడేందుకు చికిత్స కోసం ..సహకరించాలని ప్రభుత్వం, ఎన్జిఓలు, ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంపాక్ట్​ గురూ ఫండ్​ రైజర్​ ఫౌండేషన్​ ద్వారా ఫండ్​ రైజ్​ చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పటికే రూ. 4.27 కోట్లు మేర దాతల సహకారంతో అందుకున్నారు. కాగా, ఈ చిన్నారి హృదయ విదారక స్థితిని చూసి భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.. ‘‘అయాన్ష్ చికిత్సకు మీ వంతు సహకారం అందించగలరు!”అంటూ పేర్కొన్నాడు. ఈ చిన్నారి చికిత్సకు మీరు కూడా విరాళాలు పంపాలనుకుంటే కింది పద్ధతుల అనుసరించవచ్చు.

1. ఇంపాక్ట్ గురు వెబ్‌సైట్‌ను సందర్శించండి. పేటీఎం ద్వారా మీ విరాళాన్ని పంపించవచ్చు.

2. NEFT / IMPS / RTGS ద్వారా (అకౌంట్​ నెంబర్​: 700701717157379, IFSC కోడ్​ YESB0CMSNOC​) గల అయాన్ష్​ గుప్తా బ్యాంక్​ అకౌంట్​కు మీ విరాళాన్ని పంపించవచ్చు.

3. యుపిఐ: supportayaansh1 @ yesbankltd
Published by:Ashok Kumar Bonepalli
First published: