హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో ఛార్జీలు ..ఇప్పుడున్న ఛార్జీలకు రెట్టింపు అవడం ఖాయమట..

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో ఛార్జీలు ..ఇప్పుడున్న ఛార్జీలకు రెట్టింపు అవడం ఖాయమట..

Auto fares: హైదరాబాద్‌ నగరవాసులకు మరో బ్యాడ్ న్యూస్. సిటీలో ఆటోఛార్జీల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఛార్జీ ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గత ఎనిమిదేళ్లుగా స్థిరంగా ఉన్న ఆటో ఛార్జీలు పెరుగుతాయన్న వార్త నగరవాసుల్ని భయపెడుతోంది.

ఇంకా చదవండి ...

ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటున్నారు జంటనగరల్లో ఆటో డ్రైవర్లు. ఎందుకంటే నగరవాసులు అత్యధికంగా ప్రయాణించేది ఆటోల్లో కావడంతో ఒకరకంగా నగరవాసులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాద్‌(Hyderabad)లో త్వరలోనే ఆటో ఛార్జీలు(Auto charges) పెరగనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటో ఛార్జీ రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆటో బేస్‌ ఛార్జీ 20రూపాయలు ఉంటే అది 40రూపాయలకు పెరుగుతుంది. అది కూడా 1.6 కిలోమీటర్ల దూరానికి నిర్ణయించిన ధర మాత్రమే. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కి 11రూపాయల నుంచి 25రూపాయలు పెంచనున్నారు. జంటనగరాల పరిధిలో సుమారు ఎనిమిది సంవత్సరాలు(8Years)గా ఆటో ఛార్జీలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, ఆటో అద్దెలను దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవర్ల యూనియన్‌(Auto Union)లు ధరలు పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రతిపాధనను హైదరాబాద్ రవాణాశాఖ(Hyderabad Transport Department)కు పంపించడం కూడా జరిగింది. ఆటో డ్రైవర్ల ప్రతిపాదనలను హైదరాబాద్ రవాణాశాఖ ఆమోదిస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న ఆటో ఛార్జీల ధరలు రెట్టింపు అవడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం జంటనగరాల పరిధిలో అమలవుతున్న ఆటో ఛార్జీలు 2014సంవత్సరంలో నిర్ణయించినవే కావడంతో ఆటో యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రతిపాధనలను గతం రెండేళ్ల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు చర్చలు జరిపినప్పటికి ఛార్జీల పెంచే ప్రతిపాదనలను రవాణాశాఖ ఆమోదించకపోవడంతో పాత ఛార్జీలనే వసూలు చేస్తున్నారు.

సామాన్యుడిపై మరో భారం..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా ఉండే ఖర్చుల కంటే నిత్యవసర సరుకులు, పెట్రోల్,డీజిల్‌ ధరలు పెరగడం వల్ల పడిన భారం ఎక్కువగా కనిపిస్తోంది. ఈపరిణామాలను దృష్టిలో పెట్టుకొనే ఆటో యూనియన్లు సైతం నగరంలో పాత ఛార్జీలతో ఆటోలు నడపలేని పరిస్థితి నెలకొంది. సొంత ఆటో ఉన్న వాళ్లకు పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ఖర్చులు పోగా కనీసం రోజువారి కూలీ కూడా గిట్టుబాటు పరిస్థితి నెలకొన్నట్లుగా ఆటో యూనియన్లు చెబుతున్నాయి. ఇక కిరాయి ఆటోలు నడిపే వాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిన నేపధ్యంలో ఈ ధరల సవరణ నిర్ణయం తీసుకున్నట్లుగా యూనియన్ వర్గాలు వెల్లడించాయి.

తప్పదా ధరాభారం..

ఒకవేళ ఆటో యూనియన్ల ప్రతిపాదనలను రవాణాశాఖ ఆమోదిస్తే నగరపౌరులపై అధిక భారం పడుతుంది. ప్రధానంగా రోజూ ఆటోల్లో తిరిగే ఉద్యోగస్తులు, స్కూల్‌ పిల్లల తల్లిదండ్రులకు ఛార్జీల మోత మోగనుంది.

First published:

Tags: Auto News, Greater hyderabad

ఉత్తమ కథలు