HYDERABAD AUTO CABS AND LORRY SERVICES IN HYDERABAD WILL BE CLOSED FOR ONE DAY SNR
Telangana:ఇవాళ అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో క్యాబ్స్, ఆటోలు బంద్..ఎందుకంటే..?
ప్రతీకాత్మక చిత్రం
TS/Hyderabad:బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్, లారీ సర్వీసులు అందుబాటులో ఉండవు. న్యూ మోటర్ వెహికల్ యాక్ట్ 2019పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న జరిమానాలకు వ్యతిరేకిస్తూ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది.
బుధవారం(Wednesday)అర్ధరాత్రి నుంచి హైదరాబాద్(Hyderabad)లో ఆటో(Auto)లు, క్యాబ్‌లు(cabs), లారీలు(lorrys) సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల(Private transport drivers)ను నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం న్యూమోటర్ వెహికల్ చట్టం (New Motor Vehicle Act)2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు వాహనాల బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు. అంతే కాదు ఫిట్నెస్(Fitness)లేట్ ఫీజు(Late fees)పేరుతో రోజుకు 50రూపాయలు వసూలు చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు డ్రైవర్లు. పెరిగిన పెట్రోల్Petrol,డీజిల్, (Diesel),గ్యాస్, (Gas)ధరలతో భారంగా వాహనాలు నడుపుతున్న తమపై అదనపు భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం(Thursday) ట్రాన్స్‌పోర్టు భవన్(Transport Building)ముట్టడికి పిలుపునిచ్చింది. ఖైరతాబాద్(Khairatabad)చౌరస్తా నుంచి ట్రాన్స్పోర్ట్ భవన్ వరకు డ్రైవర్ల యూనియన్ జేఏసీ భారీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించింది.
ఒక్కరోజు క్యాబ్స్, ఆటోలు బంద్..
వెహికల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఈఎంఐలు విపరీతంగా పెరిగిపోయి..వాహనాలు నడపడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ కార్మికుల నడ్డివిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్నెస్ లేట్ ఫీజ్ పేరుతో రోజుకు ఒక్కో వాహనంపై 50రూపాయలు ఫైన్ విధిస్తోంది. ఇలా వేసిన ఫైన్లు ఆన్లైన్లో పెండింగ్ చలాన్ల రూపంలో వేలాది రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా చూపించడం దారుణంగా పరిగణిస్తున్నారు డ్రైవర్లు. కిరాయి వాహనాలు తిప్పుకునే డ్రైవర్లకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో డైలీ కూలీ గిట్టుబాటు కావడం లేదని..సొంత వెహికల్ ఓనర్లకు ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఈఎంఐలతో వాహనాలు నడపలేని స్థితిలో ఉంటే..మరోవైపు ప్రభుత్వం ఈతరహా దోచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కష్టాలు మీకు కనపడవా..
కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి అప్పులు పాలైన డ్రైవర్లు..ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ప్రభుత్వం ఈవిధంగా ఫైన్లు, కొత్త చట్టాల అమలు ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం సరికాదని సూచిస్తున్నారు. రోజు రోజుకు నిత్యవసర సరుకుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికి ఆటో, క్యాబ్‌ల మీటర్ ఛార్జీలు మాత్రం అందుకు అనుగూణంగా పెంచలేదంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల ఆర్ధిక స్థితిగతులను అర్ధం చేసుకొని నూతన మోటర్ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలని..ఫిట్నెస్ లేట్ ఫీజ్ ఛార్జీలను తొలగించాలని కోరుతున్నారు. అలాగే ఇష్టానుసారంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను సైతం జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సర్కారు దిగొచ్చేనా..
ఒక్కోరోజు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్ కారణంగా బుధవారం అర్ధరాత్రి నుంచి సిటీలో ఎలాంటి క్యాబ్స్, ఆటోలు, లారీలు అందుబాటులో ఉండవు. కాబట్టి నగరపౌరులు, హైదరాబాద్ జంటనగరాల ప్రజలు దూర ప్రయాణాలు,వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.