Home /News /telangana /

HYDERABAD AUTHORITIES SET FIRE TO DRUGS WORTH RS 150 CRORE IN HYDERABAD SNR

Telangana : హైదరాబాద్‌లో 150 కోట్ల రూపాయల డ్రగ్స్ తగలబెట్టారు ..ఎవరో ? ఎందుకో తెలుసా

(డ్రగ్స్ కాల్చివేత)

(డ్రగ్స్ కాల్చివేత)

Telangana: భారీ మొత్తంలో డ్రగ్స్‌ని కాల్చివేశారు తెలంగాణ కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు. మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవంలో రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో పట్టుకున్న కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ని బూడిద చేశారు అధికారులు. తగలబెట్టిన డ్రగ్స్ విలువ 150కోట్లు చేస్తుందని అధికారులు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana)లో కోట్లాది రూపాయల డ్రగ్స్‌ని తగలబెట్టారు అధికారులు. కస్టమ్స్(Customs), డీఆర్‌ఐ(DRI) అధికారులు పర్యవేక్షణలోనే ఈకార్యక్రమం జరిగింది. మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవంలో భాగంగా బుధవారం దుండిగల్‌లోని హైదరాబాద్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ (Hyderabad Waste Management Project)ఆవరణలో హెరాయిన్Heroin, కొకైన్ cocaine, marijuana, గంజాయిని కాల్చివేశారు అధికారులు. గత రెండేళ్లలో దాదాపు 35 కిలోల హెరాయిన్‌, కొకైన్‌తో పాటుగా గంజాయిని హైదరాబాద్‌(Hyderabad) డీఆర్‌ఐ, హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 20.35 కిలోల హెరాయిన్‌తో పాటు 4,812 కిలోల గంజాయి మరికొన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి.

150కోట్ల డ్రగ్స్ బుగ్గిపాలు..
రెండళ్ల కాలంలో పట్టుబడిన మొత్తం డ్రగ్స్‌ని ల్లో DRIతో పాటు హైదరాబాద్ జోనల్ యూనిట్, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండేళ్ల కాల వ్యవధిలో పట్టుకున్నారు. వీటిపై ఐదు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. డ్రగ్‌ డిస్ట్రక్షన్‌ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్‌ అధికారులు బుధవారం కాల్చిబూడిద చేశారు. తెలంగాణ కస్టమ్స్‌, సెంట్రల్‌ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ బీవీ సివంగకుమారి, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల సమక్షంలో దుండిగల్‌లోని హైదరాబాద్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు ఆవరణలో డ్రగ్స్‌ను కాల్చివేత కార్యక్రమం చేపట్టారు.



అధికారులే తగలబెట్టారు..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 6 నుండి 12 వరకు 'MoF - ఐకానిక్ వీక్' కోసం ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. అలాగే జూన్ 8ని డ్రగ్ డిస్ట్రక్షన్ డేగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 14 ప్రదేశాలలో, DRI కస్టమ్స్ కమిషనరేట్లు స్వాధీనం చేసుకున్న సుమారు 42,000 కిలోల మాదకద్రవ్యాలతో పాటు సైకోట్రోపిక్ పదార్ధాలను ధ్వంసం చేయాలని అధికారులు ఆదేశించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ సమక్షంలో షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. దానికి అనుగూణంగానే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మత్తు పదార్ధాలను ధ్వంసం చేశారు.

ఇది చదవండి : రాంగ్ రూట్ లో ట్రిపుల్ డ్రైవింగ్..అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ పై పరుగెత్తించి మరీ దాడి!


రెండేళ్లలో పట్టుబడ్డ డ్రగ్స్..
హైదరాబాద్ కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్న డ్రగ్స్‌పై అధికారులు సీతకన్నేశారు. ఎక్కడా నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకోవడమే లక్ష్యంగా దాడులు, సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లోని వాహనాలు, అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల లగేజీతో పాటు కొరియర్‌ ద్వారా సప్లై అవుతున్న డ్రగ్స్‌ని పట్టుకుంటున్నారు అధికారులు. ఇకపై కూడా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ నిషేధించడానికి, రవాణా అవుతున్న మాదకద్రవ్యాలను పట్టుకోవడానికి ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది  తెలంగాణ ప్రభుత్వం.

Published by:Siva Nanduri
First published:

Tags: Drugs, Hyderabad, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు