• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD AUNT AND UNCLE KILLED 2 MONTH OLD BOY IN ABDULLAPURMET SU

Hyderabad: పిల్లలు పుట్టడం లేదనే అక్కసు.. భార్యభర్తలు కలిసి ఎంత దారుణానికి పాల్పడ్డారంటే..

Hyderabad: పిల్లలు పుట్టడం లేదనే అక్కసు.. భార్యభర్తలు కలిసి ఎంత దారుణానికి పాల్పడ్డారంటే..

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలు పుట్టడం లేదని అక్కసుతో ఓ మహిళ చాలా దారుణానికి పాల్పడింది. ఇందుకు ఆమె భర్త కూడా సాయం చేశాడు.

  • Share this:
    పిల్లలు పుట్టడం లేదని అక్కసుతో ఓ మహిళ చాలా దారుణానికి పాల్పడింది. తన ఆడపడుచు కొడుకును హత్య చేసింది. 2 నెలల బాబు అనే కనికరం కూడా లేకుండా ఈ దారుణానికి పాల్పడింది. ఇందుకు ఆమె భర్త కూడా సాయం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. అనాజ్‌పూర్‌కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్‌తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అయితే వీరికి ఇటీవలే బాబు జన్మించాడు. ఆ చిన్నారికి ఉమామహేశ్వర్ అనే పేరు పెట్టారు. బాబు పుట్టినప్పటి నుంచి లత అనాజ్‌పూర్‌లో తమ్ముడు బాలరాజ్, మరదలు శ్వేతతో కలిసి వారి ఇంట్లోనే ఉంటుంది. ఇక, లత భర్త తిరుమలేశ్.. తరుచూ వచ్చి బాబను చూసి వెళ్తుండేవాడు.

    ఇక,గురువారం భోజనం పూర్తి చేసిన తర్వాత లత బాబును పక్కన పెట్టుకుని నిద్రపోయింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన లతకు బాబు కనిపించలేదు. దీంతో బాబు కోసం పలుచోట్ల గాలింపు చేపట్టారు. అయినప్పటికీ బాబు ఆచూకీ లభించలేదు. చివరకు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో బాబు మృతదేహం లభించింది.

    ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. చిన్నారి హత్య వెనకాల ఉన్న మిస్టరీని చేధించారు. బాబును హత్య చేసి నీటి ట్యాంకులో పడేసినట్టుగా గుర్తించారు. తమకు పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి మేనమామ, అత్త ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

    ఇది చదవండి: Hyderabad: వెంటనే ఇంటికి రండి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అసలేం జరిగిందంటే

    ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ‘తనకు పిల్లలు కాకుండా ఆడపడుచుకి బాబు పుట్టడంతో శ్వేత ద్వేషం పెంచుకుంది. శ్వేతకు అబార్షన్ కావడంతో పిల్లల విషయమై.. భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే లత పక్కన పడుకున్న ఆమె బాబును శ్వేత అర్ధరాత్రి సమయంలో ఇంటిపైకి తీసుకెళ్లి.. గొంతునులిమి హత్య చేసింది. ఆ తర్వాత వాటర్ ట్యాంక్‌లో పడేసింది. ఇందుకు శ్వేత భర్త రాజు సహకరించాడు’అని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు