హైదరాబాద్‌లోని సైదాబాద్, సింగరేణి కాలనీలో తీవ్ర కలకలం రేపిన ఆరేళ్ల బాలిక హత్యోదంతం మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళ్‌హాట్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. స్థానికంగా ఉండే ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు సుమిత్ అనే యువకుడు ఖాళీగా ఉన్న దుకాణం షేటర్లోకి చిన్నారిని లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో.. అక్కడికి వెళ్లిన స్థానికులు.. సుమిత్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల అలర్ట్‌తో చిన్నారి సేఫ్‌గా బయటపడింది. తప్పించుకున్న నిందితుడిని అత్తాపూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హబీబ్‌నగర్ పరిధిలో నమో దైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాలిక నివసించే ప్రాంతానికి పోలీసులతో కలిసి చేరుకున్న ఏసీపీ నరేందర్ రెడ్డి అత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్నారు. మొదట బాలికను భరోసా కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం కోఠి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇక సైదాబాద్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరవకముందే మళ్ళీ అలాంటి దారుణమే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి కఠిన శిక్ష వేయాలని బాధితురాలి తల్లి తండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో అత్యాచారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వారి తల్లిదండ్రుల పిల్లలను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటే మంచిది. కఠినమైన చట్టాలు కీచక కాండలను ఆపడం లేదని సర్వేల్లో స్పష్టం అవుతోంది. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన శిక్షలతో కూడిన చట్టాలను తీసుకు వచ్చినా తెగించిన మగాళ్లు వాటికి భయపడటం లేదని పోలీసుల గణాంకాలే చెబుతున్నాయి.
ప్రత్యేకించి దేశ రాజధానిలో జరుగుతున్న అకృత్యాల వివరాలను బట్టి చూస్తే ఈ విషయంపై స్పష్టత వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతండటంతో హైదరాబాద్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Minor girl, RAPE, Saidabad Rape Case, Telangana, Telangana News