అందుకే నాపై దాడి చేశారు -షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన సుఖీభవ ఫేమ్ శరత్ రెడ్డి -అయ్యయ్యో వద్దన్నా..

సుఖీభవ్ ఫేమ్ శరత్

‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ..’ అంటూ చిన్న వీడియోతో ఓవర్ నైట్ పాపులరైపోయాడు హైదరాబద్ యువకుడు శరత్. మొన్న ఆదివారం అతనిపై దాడి జరిగింది. తీవ్రగాయాలు, ముఖం నిండా రక్తంతో శరత్ ఫొటోలు మళ్లీ వైరలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శరత్.. అసలేం జరిగిందో చెప్పాడు. ఆ క్రమంలోనే అతని షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ రివీలైంది..

  • Share this:
శరత్ రెడ్డి అలియాస్ సుఖీభవ శరత్ అలియాస్ నల్లకుంట శరత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వినాయక నిమజ్జనం సందర్భంలో ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ..’అనే వీడియోతో ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టారైపోయిన శరత్ పై మొన్న ఆదివారం దాడి జరిగింది. గాపడింది శరతేనా? అని గుర్తుపట్టలేనంతలా ముఖం నిండా రక్తంతో అతని ఫొటోలు మరోసారి వైరలయ్యాయి. ఈ దాడిపై భిన్న ప్రచారాలు జరగ్గా, చివరికి కేసు పోలీసుల వద్దకు చేరింది. జరిగిన సంఘటన, దానిని దారి తీసిన షాకింగ్ కారణాలను శరత్ స్వయంగా వెల్లడించాడు..హైదరాబాద్ లోని నల్లకుంటకు చెందిన శరత్ రెడ్డి చిన్నపాటి డాన్సర్ గా రాణిస్తూ, అడపాదడపా యూట్యూబ్ ఛానళ్లలో మెరుస్తూ, ఇటీవల రెడ్ లేబుల్ టీపొడి ప్రకటనను అనుకరిస్తూ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ..’ వీడియోతో పాపులారిటీ పొందడం, అతనిపై వేలాదిగా మీమ్స్ వస్తుండటం తెలిసిందే. కాగా, శరత్ పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేశారు. సుఖీభవ ప్రకటనను అనుకరిస్తూ హిజ్రాలను హేళన చేసినందుకు కోపంతో హిజ్రాలే శరత్ పై దాడి చేసినట్లు తొలుత ప్రచారం జరిగింది. మతం కోణంలోనూ కామెంట్లు వచ్చాయి. కానీ..

తనపై దాడి చేసింది హిజ్రాలు కాదని శరత్ స్పష్టం చేశాడు. తాజాగా మీడియా ముందుకొచ్చిన అతను షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాడు. తనపై దాడి చేసింది ప్రత్యర్థులేనని, గతంలో వాళ్లను ఎదిరించి తాను జైలు శిక్షను కూడా అనుభవించానని, సుఖీభవ్ వీడియో తర్వాత పాపులారిటీ పెరిగి, సినిమా ఆఫర్లు కూడా వస్తుండటంతో ఓర్చుకోలేకే వ్యతిరేక వర్గంవాళ్లు దాడికి పాల్పడ్డారని శరత్ తెలిపాడు.

‘సాయి, హరి గ్రూపులతో నాకు గొడవలున్నాయి. గతంలో నా చెల్లిని వేధించినందుకు ఆ రెండు గ్రూపులపై నేను దాడి చేశాను. ఆ కేసులో నేను జైలుకు కూడా వెళ్లాను. బెయిల్ పై జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేక, నా ఎదుగుదలను ఓర్చుకోలేకే ప్రత్యర్థులు నాపై దాడి చేశారు’అని శరత్ వివరించాడు. ఆదివారం నాటి దాడికి సంబంధించి సాయి, హరి వర్గాలపై రామగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని శరత్ చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Madhu Kota
First published: