హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: బుల్లెట్టు బండి సాంగ్‌తో పాపులరైన పెళ్లి కొడుకు .. అవినీతి ఉద్యోగిగా ఏసీబీకి చిక్కాడు

Hyderabad: బుల్లెట్టు బండి సాంగ్‌తో పాపులరైన పెళ్లి కొడుకు .. అవినీతి ఉద్యోగిగా ఏసీబీకి చిక్కాడు

HYDERABAD ACB RIDE(file)

HYDERABAD ACB RIDE(file)

VIRAL NEWS: తన పెళ్లి ఊరేగింపుతో బాగా పాపులర్ అయిన ఓ ప్రభుత్వ అధికారి ఇప్పుడు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని బడంగ్‌ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్‌ ప్లానర్‌గా పని చేస్తున్న అశోక్‌ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అనే సాంగ్‌తో పాపులర్ అయ్యాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తన పెళ్లి ఊరేగింపుతో బాగా పాపులర్ అయిన ఓ ప్రభుత్వ అధికారి ఇప్పుడు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదకశాఖ(ACB)అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ (Hyderabad)లోని బడంగ్‌ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్‌ ప్లానర్‌గా పని చేస్తున్న అశోక్‌ ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన అశోక్‌ (Ashok) నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఆయన ఆస్తులు, ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీస్తున్నారు.

ఇంట్లోనూ ఏసీబీ సోదాలు..

టౌన్‌ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్న అశోక్‌ సుమారు రెండేళ్ల క్రితం ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఆయన వివాహం ముగిసిన తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో అశోక్‌ సతీమణి నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అన్న పాటతో భార్యభర్తలిద్దరూ పాపులర్ అయ్యారు. ఒక్క పాటతో తెలంగాణలోనే కాదు చాలా మందికి గుర్తిండి పోయింది ఈజంట. అయితే బ్యాడ్‌ లక్ ఏంటంటే అంత పాపులారిటీ సంపాధించుకోవడం కారణంగా ఇప్పుడు లంచం తీసుకొని దొరికిపోవడంతో అంతే వేగంగా సోషల్ మీడియాలో అశోక్‌ పేరు అవినీతి అధికారి ఇతనే అంటూ వైరల్ అవుతోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana crime news

ఉత్తమ కథలు