హోమ్ /వార్తలు /తెలంగాణ /

అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..70 ఏళ్లుగా మమ్మల్ని దోచుకుంటున్నారంటూ..

అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..70 ఏళ్లుగా మమ్మల్ని దోచుకుంటున్నారంటూ..

అసదుద్దీన్ ఒవైసీ (ఫైల్ ఫోటో)

అసదుద్దీన్ ఒవైసీ (ఫైల్ ఫోటో)

హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించిన ఓ బహిరంగసభలో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించిన ఓ బహిరంగసభలో MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు బానిసలుగా ఉండాలని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తాయన్నారు. ముస్లింలంతా ఏకమై ఓ నాయకత్వం కింద ఎదగటం రాజకీయ పార్టీలకు నచ్చదని వ్యాఖ్యానించారు.

Hyderabad Metro:మళ్లీ మొరాయించిన మెట్రో... కదలని రైలు కిందకు దిగిన ప్రయాణికులు..!

గత 70 ఏళ్లుగా కేవలం ముస్లిం ఓటు బ్యాంకునే వాడుకుంటున్నాయని అన్నారు. దేశంలో అగ్రకులాలే రాజకీయంగా ఉండాలని భావన ఉందని అసదుద్దీన్ విమర్శించారు. ఇక ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనారిటీ హిందువులు ఏకతాటిపైకి వస్తే రాజకీయ పార్టీలకు నచ్చదని ఒవైసి (Asaduddin Owaisi) విమర్శించారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుకోవడం వల్ల ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసదుద్దీన్  (Asaduddin Owaisi) అన్నారు.

Inspirational Story: ఢిల్లీ పార్లమెంట్‌కు డిగ్రీ విద్యార్దిని .. మోదీ ముందు మాట్లాడే ఛాన్స్ కొట్టేసిన శ్రీవర్షిణి

గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే..గాడ్సేపై మీ అభిప్రాయం ఏంటని ప్రధాని మోదీని అసదుద్దీన్ ఒవైసి  (Asaduddin Owaisi) ప్రశ్నించారు. గాడ్సేపై సినిమా నిర్మిస్తున్నారు. దీనిని మీరు ఇండియాలో బ్యాన్ చేస్తారా అన్నారు. మీపై, బీజేపీపై ప్రచారం చేస్తున్న వారిని బ్యాన్ చేస్తున్నారు. మరి గాంధీని చంపిన హంతకుడు గాడ్సేపై తీయబోతున్న సినిమాను ఇక్కడ బ్యాన్ చేస్తారా లేదా అన్నారు. ఇక గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీపై బీబీసీ డాక్యూమెంటరీలో చర్చలు జరగడం మీరూ చూస్తున్నారన్నారు. అల్లర్లు జరిగినప్పుడు మోదీ ముఖ్యమంత్రిగా లేరా? బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. కాంగ్రెస్ ఎంపీని చంపారని అన్నారు.

ఇక హైదరాబాద్ పోలీసు కమీషనర్ కు అసదుద్దీన్ ఒవైసి (Asaduddin Owaisi) ఓ విజ్ఞప్తి చేశారు. నగరంలో తల్వార్లు, కత్తులతో దాడులకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలి. అందుకోసం ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలనీ అసదుద్దీన్ (Asaduddin Owaisi) అన్నారు. అలాగే వారికి బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.  కాగా గతంలో కూడా అసదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగా తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

First published:

Tags: Asaduddin Owaisi, Hyderabad, MIM, Telangana

ఉత్తమ కథలు