హోమ్ /వార్తలు /తెలంగాణ /

High court on Schools : స్కూళ్ల రీ ఓపెన్‌ పై టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..!

High court on Schools : స్కూళ్ల రీ ఓపెన్‌ పై టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..!

High court on Schools  : ఓ వైపు కరోనా భయం మరోవైపు .. ఇంకోవైపు స్కూళ్ల ప్రారంభం ఈ రెంటింటి నడుమ హైకోర్టులో విచారణ.. ఏం తేలనుందో.. స్కూళ్లకు అనుమతి ఇస్తుందా.. లేక సర్కార్‌కు షాక్ ఇస్తుందా... ? మరి కొద్ది గంటల్లో తేలనుంది..

కరోనా ప్రభావం తగ్గింది..(corona) ఇక స్కూళ్లను తెరిచేందుకు తెలంగాణ(Telangana) రాష్ట్ర సర్కారు సన్నద్దమవుతుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో సగం మంది కూడా వయోజనులు టీకా ఇప్పించుకోని పరిస్థితి. టీకా 100 శాతం ఇప్పించుకున్న దేశాల్లోనే కొవిడ్(covid) తీవ్రతా కనిపిస్తోంది.. పెద్దవాళ్లే పిట్టల్లా రాలిపోతున్నారు. దీనికి తోడు పలు పరిశోధన సంస్థలు కోవిడ్ ధర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని చెబుతున్నాయి. మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు , సంస్థలు కొవిడ్ ప్రభావం ఉండదు అంటున్నాయి.. వెరసి విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనేక అనుమానాలు , ఆందోళణ కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటీ శాస్త్రీయత లేకుండా స్కూళ్లను ప్రారంభించేందకు సన్నద్దం అయింది. సెప్టెంబర్ (september) ఒకటి నుండి అన్ని రకాల విద్యాలయాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇది చదవండి : కొవిడ్ ఆసుపత్రిలో గ్రూప్ సెక్స్... ఇంకా చాలా సిత్రాలు ఉన్నాయ్.. !

అయితే స్కూళ్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని(high court) హైకోర్టులో(PIL) పిల్ వేశారు. దీంతో ఆ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. స్కూళ్ల ప్రారంభంపై ఎలాంటి శాస్త్రీయపరమైన విధానాలు, రిపోర్టులు రూపోందించలేదని పిటిషనర్ పేర్కోన్నారు. దీంతో పిల్లల భవిష్యత్‌తో ప్రభుత్వం చలగాటం అవుతుందని పిటిషన్‌లో పేర్కోన్నారు. ముఖ్యంగా ఎన్ఐడీఎం నివేదిక ప్రకారం సెప్టెంబర్ , ఆక్టోబర్ నెలలో ధర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారని వివరించారు.

కాగా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్(vaccination) కాకపోవడం పిల్లల్లో కూడా వ్యాక్సినేషన్ చేయించక పోవడంతో అనేక అనుమానాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు వివరాలు అందించారు. దీంతో పిల్‌లు విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారించనుంది. కాగా ఈ పటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన జస్టీస్ రామచంద్రరావు విచారించనున్నారు. కాగా ఆయన విచారిస్తున్న మొదటి కూడా కావడంతో ఉత్కంఠ నెలకొంది.

కోర్టు ఎలాంటీ తీర్పును ఇస్తుంది. ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయనే టెన్షన్ రెండు వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా స్కూళ్లకు సంబంధించిన బస్సుల ఫిట్‌నెస్‌ కూడా ఇప్పటివరకు తేల్చకపోవడం వేల మంది పిల్లలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తే కరోనా ప్రభావం ఎట్లా ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. దీంతో స్కూళ్ల ప్రారంభం మంగళవారం నాటి కోర్టు తీర్పుతో తేలనుంది.

First published:

Tags: Highcourt, Schools reopening, Telangana

ఉత్తమ కథలు