హోమ్ /వార్తలు /తెలంగాణ /

Andhra Pradesh: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్ పదవీ విరమణ..ఆమోదించిన ఏపీ సీఎం

Andhra Pradesh: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్ పదవీ విరమణ..ఆమోదించిన ఏపీ సీఎం

cs someshkumar

cs someshkumar

AP|TS:తెలంగాణ మాజీ చీఫ్ సెక్రట్రీ, సీనియర్ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీఆర్ఎస్‌ తీసుకోవాలని వ్యక్తిగతంగా అభ్యర్ధించడం కారణంగానే పోస్ట్ కేటాయించలేదని.. ఏపీ సర్కారు పేర్కొంది. ఆయన వీఆర్ఎస్‌ను ఆమోదించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రట్రీ, సీనియర్ ఐఏఎస్‌(IAS) అధికారి సోమేశ్‌కుమార్ (Somesh kumar)స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అంతే కాదు సోమేష్‌కుమార్‌ వాలంట్రీ రిటైర్‌మెంట్ సర్వీస్‌ను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆమోదించారు. గతంలో తెలంగాణ సీఎస్‌(cs)గా బాధ్యతలు నిర్వహించిన సోమేశ్‌కుమార్‌ను ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు(High court) నిర్ధారించింది. అంతే కాదు ఏపీకి బదిలీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సీనియర్ ఐఏఎస్‌ అధికారి జనవరి 12న ఏపీ కేడర్‌లో రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌(Jagan)ను కూడా కలిశారు. ఈ పరిణామాలు జరిగి సుమారు నెల రోజులు గడిచినప్పటికి ఏపీ ప్రభుత్వం సోమేశ్‌కుమార్ కు పోస్ట్ కేటాయించలేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన వ్యక్తిగ అభ్యర్ధన మేరకే ఎలాంటి పదవి కేటాయించలేదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

సీనియర్ ఐఏఎస్‌ నిర్ణయానికి సర్కారు ఆమోదం..

తెలంగాణ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పని చేసిన సీనియర్ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ మాజీ చీఫ్ సెక్రట్రీ సోమేశ్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఏపీ క్యాడర్‌కి చెందిన ఈ ఐఏఎస్‌ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. గత నెలలో ఏపీ అధికారిగా బదిలీ చేయబడ్డ సోమేశ్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్ట్ కేటాయించలేదు. ఈనేపధ్యంలోనే ఆయన వాలంటీర్‌ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

స్వచ్చంద పదవీ విరమణ..

గతంలో తెలంగాణ సీఎస్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నతమైన బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా ఇటీవలే తెలంగాణ హైకోర్టు తెలిపింది. అందుకే ఆయన్ని ఏపీకి వెళ్లాలంటూ ఆదేశించడంతో సోమేశ్‌కుమార్‌ని సీఎస్‌గా తొలగిస్తూ ఆయన స్థానంలో రత్నకుమారి అనే ఐఏఎస్‌ అధికారిణికి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కారు. ఏపీకి బదిలీ కాబడిన సోమేశ్‌కుమార్ జనవరి 12న ఏపీ క్యాడర్‌లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం కావడంతో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ స్వచ్చందంగా పదవీ విరమణ చేయాలనుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన వ్యక్తిగ అభ్యర్ధన మేరకే ఎలాంటి పదవి కేటాయించలేదంటోంది.

First published:

Tags: Andhra pradesh news, Cs somesh kumar

ఉత్తమ కథలు