Fire Accident : నిన్న హైదరాబాద్‌లోని కొత్త సెక్రటేరియట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం హాట్ టాపిక్ అయ్యింది. ఇవాళ మరొకటి. రామాంతపూర్‌లోని ఓ ఫర్నిచర్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు వచ్చినట్లు తెలిసింది. మంటలు, పొగను చూడగానే అలర్టైన స్థానికులు.. వెంటనే ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది.
సాధారణంగా ఎండాకాలంలో వేడి వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో చలికాలంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరిగిన ప్రతిసారీ... ఫైర్ సేఫ్టీ సరిగా లేదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hydarabad, Telangana News