MLA Rajasingh: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు శ్రీరామనవమి రోజు షాక్ తగిలింది. తాజాగా రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది. జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ రెచ్చగోట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు రాజాసింగ్ పై FIR నమోదు చేశారు. ఐపీసీ 153ఎ 1 (ఎ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ముంబైలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పిన విషయాన్ని ఈ నోటీసుల్లో గుర్తు చేశారు. కాగా గతంలో కూడా రాజాసింగ్ పై కేసులు నమోదు కాగా..కొన్నిరోజులు జైల్లో ఉండి ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈనెల 29న ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ (Bjp Mla Rajasingh) ఓ వర్గం వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. బెయిల్ సమయంలో కోర్టు ఇచ్చిన షరతులను ఎమ్మెల్యే ఉల్లంఘించారని అన్నారు. కాగా ఈ నోటిసులపై రాజాసింగ్ (Bjp Mla Rajasingh) స్పందించారు. తాను ఎప్పుడైనా ధర్మం కోసం పోరాటం చేస్తానని, తనను తెలంగాణ నుంచి బహిష్కరించిన లేక జైలులో పెట్టినా కూడా ధర్మం కోసమే పని చేస్తానని గతంలో చెప్పారు.
Mumbai police registered FIR against suspended BJP MLA T Raja Singh over his hate speech during a public meeting in Mumbai on 29th January. FIR registered under IPC section 153A 1(a): Mumbai Police
(File pic) pic.twitter.com/29cA3rTl2g — ANI (@ANI) March 30, 2023
ఇక గతేడాది అజ్మీర్ దర్గాపై ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ (BJP MLA Raja singh) పై కేసు నమోదు అయింది. ఆ తరువాత ఈ కేసును కంచన్ భాగ్ నుండి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళ్ హాట్ పోలీసులు జనవరి 20న 41A CRPC కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బెయిల్ పై బయటకు రాజాసింగ్..
కాగా ఈ ఏడాది ఆగష్టు 25న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 29న పీడీ యాక్ట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ (Raja Singh) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. తనపై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ (Raja Singh) కమిటీకి విన్నవించుకున్నాడు. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బోర్డు దృష్టికి తీసుకొచ్చాడు. కానీ దీనిపై విచారణ జరిపిన బోర్డు పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను సమర్ధించింది. పీడీ యాక్ట్ ఎత్తివేయాలన్న రాజాసింగ్ (Raja Singh) అభ్యర్ధనను కమిటీ తిరస్కరించింది. కానీ దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేయగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే 2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 కేసులు కేవలం మతపరమైన విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవే కావడం గమనార్హం. ఇప్పటికే రాజాసింగ్ పై పీడి యాక్ట్ కూడా నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు నమోదు కావడం ఇదే మొదటిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Hyderabad, Raja Singh, Telangana