HYDERABAD ANDHRAJYOTHY MD RADHA KRISHNA WIFE KANAKADURGA DIED OF HEART ATTACK SSR
Radha Krishna Wife: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కుటుంబంలో విషాదం
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ, ఆయన భార్య కనకదుర్గ
వేమూరి రాధాకృష్ణ భార్య వేమూరి కనకదుర్గకు గుండెపోటు రావడంతో అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 63 సంవత్సరాలు. కొద్దిరోజులుగా వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేమూరి కనకదుర్గ మృతికి...
హైదరాబాద్: ఏబీన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణకు సతీ వియోగం కలిగింది. వేమూరి రాధాకృష్ణ భార్య వేమూరి కనకదుర్గకు గుండెపోటు రావడంతో అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 63 సంవత్సరాలు. కొద్దిరోజులుగా వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనకదుర్గ మృతి పట్ల ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి బాధాకరమని చెప్పారు. వేమూరి కనకదుర్గ సేవా భావం కలిగిన వ్యక్తి అని, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్గా సంస్థ అభివృద్ధికి.. ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. ఉద్యోగులను ఉద్యోగులులా కాకుండా సొంత బిడ్డల్లా చూసుకునేవారని ఆయన చెప్పారు.
ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. కనకదుర్గ మృతి పట్ల ఎంపీ రఘురామకృష్ణమ రాజు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల సీఎం రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.