తెలంగాణలో మరో భారీ పెట్టుబడి పెట్ట్టేందుకు ప్రముఖ సంస్థ అమరరాజా గ్రూప్ (Amararaaja Group) ముందుకు వచ్చింది. రాష్ట్రంలో బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రం ఏర్పాటుకు ఏకంగా రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి (Telangana Government) అమరరాజా గ్రూప్ (Amararaaja Group) మధ్య ఒప్పందం చేసుకుంది. ఈ కేంద్రాన్ని మహబూబ్ నగర్ జిల్లా దివిటీపల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ (Minister KTR), పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, అమరరాజా గ్రూప్ చైర్మన్, ఎండి గల్లా జయదేవ్ (Galla Jayadev) పాల్గొన్నారు.
Yet another historic win for Telangana
Amara Raja to setup India's largest Lithium Ion Cell Manufacturing facility till date with an investment of ₹9,500 Cr, further reinforcing Telangana’s position as an ideal destination for EV and Advanced Cell Chemistry (ACC) Manufacturing. pic.twitter.com/z0h5BlwUyz — KTR (@KTRTRS) December 2, 2022
తెలంగాణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన అమరరాజా కంపెనీకి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా ముందుకొచ్చారు. తెలంగాణాలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
Minister @KTRTRS speaking at MoU-signing ceremony for setting up @AmaraRaja_Group's Lithium-Ion Giga Factory in Telangana. https://t.co/n30Vx6CWnK
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 2, 2022
గతంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం కోరింది. అయితే రాష్ట్ర విభజన తరువాత మా సంస్థ పెట్టుబడులన్నీ ఏపీకే పరిమితం అయ్యాయి. కొన్ని కారణాల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టలేకపోయాం. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిధనిపించింది అన్నారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అందుకే తెలంగాణను ఎంచుకొని పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. ఒకే చోట పెట్టుబడులు పెట్టడం కంటే వేర్వేరు చోట్ల ప్లాంట్లు పెట్టడం మంచిదనే ఆలోచనతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని అమరరాజా సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, KTR, Minister ktr, Telangana, Telangana News