Home /News /telangana /

HYDERABAD ALLOTMENT OF RAJIV SWAGRUHA FLATS IN HYDERABAD THROUGH LOTTERY PROCEDURE ON WEDNESDAY TO THE APPLICANTS SNR

Telangana : హైదరాబాద్‌లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు వాళ్లకే ..ఎప్పుడంటే

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana: రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో అదృష్టవంతుల్ని బుధవారం ఎంపిక చేయనున్నారు. కంప్యూటర్ లాటరీ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఫ్లాట్ల కేటాయిస్తారు. అలాగే స్తలాల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను కూడా హెచ్‌ఎండీఏ అధికారులు వేగవంతం చేశారు.

ఇంకా చదవండి ...
హైదరాబాద్‌(Hyderabad)లోని రాజీవ్ స్వగృహ( Rajiv Swagruha) ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం(Wednesday)జరగనుంది. నగరంలోని బండ్లగూడ(Bandlaguda), పోచారం(Pocharam)లో నిర్మించిన అపార్ట్‌మెంట్లలోని డబుల్‌ బెడ్రూం(Double bedroom), ట్రిపుల్‌ బెడ్రూం(Triple bedroom)ప్లాట్ల అమ్మకానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ లాటరీ(Computer lottery) విధానంలో ప్లాట్లు కేటాయించడానికి హెచ్‌ఎండీఏ, గృహనిర్మాణశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుదవారం లాటరీ విధానంలో ప్లాట్లు సొంతం చేసుకున్న వాళ్లకు ఫోన్‌కి మెసేజ్ వస్తుందని అధికారులు వెల్లడించారు. గత నెల రోజులుగా ఈ ప్లాట్ల వేలానికి సంబంధించి ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరించింది. మే 12నుంచి జూన్‌ 14వ తేది వరకు ఇచ్చిన గడువులో 39వేల 082 అప్లికేషన్స్‌ వచ్చాయి. ఇందులో బండ్లగూడ, పోచారంలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌లోని ట్రిపుల్ బెడ్రూం డిలక్స్, సాధారణ ఫ్లాట్లతో పాటు డబుల్ బెడ్రూం, సింగల్ బెడ్రూం ఫ్లాట్లకు రెండు విడతలుగా నోటిఫికేషన్ వేశారు. మొదట్లో భారీ స్పందన రావడంతో ప్రభుత్వం లక్ష దరఖాస్తులు వస్తాయని తెలిపింది. ఊహించిన విధంగా అప్లికేషన్‌లు రాకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న వాళ్లకు ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం బుధవారం జూన్‌22వ తేదిన కంప్యూటర్ లాటరీ విధానంలో ప్లాట్లు అప్పగిస్తారు.

నెరవేరుతున్న సొంతింటి కల..
నగరంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కింద నిర్మించిన అపార్ట్‌మెంట్లను విక్రయించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ గృహనిర్మాణశాఖ, హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ కలిసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు గత నెల 12వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 14వ తేదితో దరఖాస్తులు సమర్పించడానికి గడువు ముగియడంతో వచ్చిన అప్లికేషన్స్‌ నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.

నెక్స్ట్ ప్లాట్ల వేలం..
కట్టించిన ఇళ్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్న ప్రభుత్వం ఇదే పద్దతిలో హైదరాబాద్‌ పరిధి రంగారెడ్డి జిల్లాలో ప్లాట్లను అమ్ముతోంది. తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు లే అవుట్‌ స్తలంలో 148 ప్లాట్ల విక్రయానికి సంబంధించిన ప్రీ బిడ్ మీటింగ్‌ని కూడా హెచ్‌ఎండీఏ అధికారులు నిర్వహించారు. ఆన్‌లైన్‌ ఆక్షన్‌ ద్వారా వీటిని విక్రయించనున్నారు. సోమవారం జరిగిన సమావేశానికి హాజరైన సుమారు వంద మందికిపైగా కొనుగోలుదారులు తమకు ఉన్న సందేహాలను అధికారులను అడిగి క్లియర్ చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలో విక్రయిస్తున్నట్లుగానే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని రాజీవ్‌ స్వగృహ కోసం కొనుగోలు చేసిన భూమిని కూడా అంగారిక టౌన్‌షిప్‌గా లే అవుట్ వేసి వేలం నిర్వహించింది. దీనికి కూడ భారీ స్పందన లభించడం విశేషం.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు