(M. Balakrishna, news 18, Hyderabad)
చాయ్ (Tea) చట్టక్కున తాగారా బాయ్ అని మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాలో చాయ్ యెక్క గొప్పతనాన్ని చెప్పారు. అయితే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా తాగుతున్న ప్రతి చాయ్ వెనుక ఒక స్టోరీ ఉందని అంటున్నారు హైదరాబాద్ (Hyderabad)కు చెందిన తాహా (Tahaa). ప్రపంచంలో దొరికే వివిద రకాల టీ లతోపాటు వాటి తాలూక గొప్పతనాన్ని హైదరాబాద్ వాసులకు పరిచయం చేస్తున్నారు ఇక్బాల్ (Iqbal). తాహా తాత ఇక్బాల్ హుస్సేన్, 90వ దశకం ప్రారంభంలో కోల్‌కతాకు వెళ్లినప్పుడు అక్కడ నుంచి సావనీర్లతోపాటు 30 కిలోల టీ బ్యాగ్‌తో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఇక్బాల్ కోల్‌కతా నుండి తిరిగి వచ్చినప్పుడు శతాబ్దాలుగా కుటుంబం నడుపుతున్న ఫార్మాస్యూటికల్ వెంచర్‌తో పాటు టీ వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదని ఆలోచించి అప్పడు స్టార్ చేశాడు ఈ టీ వ్యాపారం.
ఆర్డర్ చేసిన చాయ్ గురించి చెబుతూ టీ ని అందించడం..
అయితే తన తాత తహ ప్రారంభించిన ఈ టీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు తాహా.. కొనసాగించడమే కాకుండా తన దగ్గర చాయ్ తాగే ప్రతి ఒక్కరికి తాము ఆర్డర్ చేసిన చాయ్ గురించి చెబుతూ టీ ని అందించడం ఇక్కడ విశేషం. చాయ్ యొక్క రహస్యాలు ఇప్పుడు తరతరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కేఫ్ ను నడుపుతున్నాం అంటారు తాహా.
తాహా (Tahaa). బంజారాహిల్స్ (Banjarahills) లో వీరు స్థాపించిన ఫింజాన్ టీస్ (Finjaan Tea)లో ప్రపంచంలో దొరికే అన్ని రకాల టీలతోపాటు వాటి హిస్టరీ కూడా చెబుతారు. అసలు ప్రపంచంలో మొదటి టీ ఎప్పుడు తయారు చేశారు.? ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఎన్ని రకాల టీ(Tea) లు ఉన్నాయి? వాటి ప్రాముఖ్యత ఏంటీ? అనే విషయాలు ఇక్కడ చెబుతూ మనకు నచ్చిన టీ ను మీ టెబుల్ పై ఉంచుతారు.
2005లో టీ దుకాణం..
“మేం ఫింజాన్ టీ స్టోర్ ను తొలుత టౌలిచోకి ప్రాంతంలో ఒక చిన్న టీ దుకాణం రూపంలో 2005లో స్థాపించాం. అయితే 2012లో మేం దుకాణాన్ని బంజారాహిల్స్ కు మార్చామని న్యూస్ 18 కి తెలిపారు తాహా. తాహా ప్రారంభించిన ఈ ఫింజాన్ కేఫ్‌లో ప్రపంచంలో ప్రసిద్ది చెందిన ఛాయ్ లే కాకుండా డార్జిలింగ్, అస్సాం చైనా నుంచి సేకరించిన 50 కంటే ఎక్కువ రకాల టీ లు అందుబాటులో ఉన్నాయి. కేవలం టీ లే కాకుండా వాటి చరిత్ర కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం మరో విశేషం. మీరు కేఫ్‌లోకి ప్రవేశించినప్పుడు, చైనీస్ టీ టేబుల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తారు. “13వ శతాబ్దంలో పాత చైనీస్ భావన నుండి వచ్చింది ఈ టీ వేడుక. అందుకే అది మేం మా కస్టమర్స్ కు తెలియపర్చడానికి అతిథిని పలకరించడానికి ఈ చైనీస్ టీ టేబుల్ పద్దతిని అనుసరిస్తామని తాహా న్యూస్ 18 కి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.