Muncipal Elections : రేపు మున్సిపల్ ఎన్నికలు షురు..కరోనాతో ఓటర్లలో టెన్షన్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ..కరోనా భయంతో ఓటర్లు

Muncipal Elections : మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్దమైంది..ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు..అయితే కరోనా విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓటర్లు ఏమేరకు స్పందిస్తారో అనే టెన్షన్ నెలకొంది..

  • Share this:
రేతెలంగాణలో రెండు మున్సిపల్ కార్పోరేషన్‌లు, అయిదు మున్సిపాలీటిలకు ఎన్నికలు జరగనున్నాయి..పోలింగ్‌కు అంతా సిద్దమాయినా..అటు అధికారులు ఇటు ఓటర్లలో కరోనా భయం వెంటాడుతోంది. దీంతో ఓటు వేసేందుకు ఓటర్లు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. మరోవైపు ఎన్నికల విజయోత్సవ ర్యాలీలను నిషేధించిన ఎస్‌ఈసీ, కౌంటింగ్‌ ప్రక్రియలో కూడ నిబంధనలు విధించింది. కరోనా నెగిటీవ్ ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌కు అనుమతి ఇస్తామని చెప్పింది.

తెలంగాణలో మినిపోల్స్‌కు రంగం సిద్దం అయింది..మరి కొద్దిగంటల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పీ.పార్థసారధి తెలిపారు.ఇందుకోసం 1539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.కాగా శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం , సిద్దిపేట, అచ్చంపేట, కోత్తూర్, నకిరేకల్, కోత్తూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మొత్తం 9809 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్టు ఆయన తెలిపారు.కాగా సిబ్బందికి మాస్క్‌లతో పాటు ఫేస్ షీల్డ్ ,శానిటైజర్లు కూడ అందించనున్నారు. ఇక ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 4557 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గోనున్నట్టు తెలిపారు.

అయితే ఎన్నికల ఏర్పాట్లు బాగానే ఉన్నా..కరోనా నేపథ్యంలోనే నగర ఓటర్లు ఏవిధంగా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఒక్క కోవిడ్ పేషంట్ వందల మందికి కరోనా సోకుతున్నట్టు అధికారులు చెబుతున్న నేపథ్యంలోనే ఏమేరకు ఓట్లు వేసేందుకు బయటకు వస్తారనేది వేచి చూడాల్సిన అంశం..పోలింగ్ కేంద్రాల్లో ఎన్ని ఏర్పాట్లు చేసినా..ఓటరు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా భయం లేకుండా ఎన్నికలు కొనసాగుతాయి. ఇంత సీరియస్‌గా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర మేధావులు కోరారు. కాని ఇందుకోసం కోర్టుకు సైతం వెళ్లిన పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు.

కాగా రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్ల మొత్తం 11 లక్షల 34 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పెద్ద మొత్తం వరంగల్ కార్పోరేషన్‌లో ఎక్కువగా 800 పైగా బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఓక్కో బాక్సులో 800 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఓటు వేసే వారు ప్రతి ఆరు అడుగులకు ఒక్కరు చొప్పున క్యూలైన్‌లో నిలబడే విధంగా ఏర్పాట్లు చేశారు.

corono death: కరోనా కల్లోలం..మే 2న పెళ్లి .. ప్రభుత్వ ఉద్యోగి మృతి


అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నా ఓటర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా నేపథ్యంలోనే ఓటర్లకు ఎలాంటీ భయాందోళనలు లేకుండా కోన్ని చోట్ల పోలీసులు ర్యాలీలు నిర్వహించి ధైర్యం చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం పోలీసులు వరంగల్‌లో కొన్ని చోట్ల ర్యాలీలు సైతం నిర్వహించారు..

ఇక ఎన్నికల సంఘం ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు రూపోందించారు. కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్నవారు మాత్రమే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గోనాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కౌంటింగ్ ముగింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు సైతం నిషేధించింది. గెలిచిన అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలని నిబంధనలు విధించింది. దీంతో ఎన్నికల జరిగే నాటి నుండి ఫలితాలు వెలువడే వరకు అంతా టెన్షన్‌గా మారింది. కరోనా భయంతో ఓటర్లు చురుకుగా ఎన్నికల్లో పాల్గోంటారా..లేదా అనేది వేచి చూడాలి.
Published by:yveerash yveerash
First published: