Hyderabad : జులై 1నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభం..కేబినెట్ నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : రేపటి నుండి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన తెలంగాణ మంత్రివర్గం మరోకీలక నిర్ణయం తీసుకుంది.. ఈ క్రమంలోనే విద్యాసంవత్సరాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో జులై ఒకటి నుండి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించాలని నిర్ణయిం తీసుకున్నారు. అయితే వాటికి సంబంధించి విధివిధానాలను ఖారారు చేయాల్సి ఉంది.

  • Share this:
కాసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం అయింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుండి పూర్తి లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల వ్యవస్థలు సాధారణ స్థితిలోకి రానున్నాయి. వీటితో పాటు విద్యావవస్థపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా కరోనా నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా విద్యావ్వవస్థ కుంటుపడుతుందా అనే అనుమానంతో ప్రజలు ఉన్నారు. అయితే అన్ని రకాల విద్యా సంస్థలను రెగ్యులర్‌గా కొనసాగించాలనే కీలక నిర్ణయానికి అమోద ముద్ర వేసింది.

అయితే వీటి నిర్వహాణపై పూర్తి విధివిధానాలు వెలువడాల్సి ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం విద్యా సంస్థలు మూత పడడంతో ప్రైవేటు టీచర్లతో పాటు అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సరైన ఇంటర్‌నెట్ సౌకర్యం లేక కనీస క్లాసులకు కూడా హజరు కాలేక పోయారు.

అయితే ఈ విద్యా సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి రాకుండా ముందే నిర్ణయం తీసుకున్నారు.కాని ముఖ్యంగా కరోనా మూడో వేవ్ విద్యార్థులు, చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందంటూ వస్తున్న నిపుణుల సూచనలతో చిన్న పిల్లల తల్లిదండ్రులు బెంబెలెత్తుతున్నారు.

అయితే అన్ని విద్యా సంస్థల అంటే ప్రాధమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్యాలయాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫిజికల్ అటెండెన్స్‌తో విద్యా సంస్థలు తెరుచుకుంటాయా..లేక ఆన్‌‌లైన్ ద్యార  క్లాసులు ప్రారంభమవుతాయా అనేది వేచి చూడాలి...

మరోవైపు దాదాపు పట్టణ ప్రాంతంలోని ప్రైవేటు విద్యా సంస్థలు తమ పిల్లలకు అన్‌లైన్ క్లాసులను బోధించేందుకు సన్నధ్దమయ్యాయి. అందుకు సంబంధించిన సర్క్యూలర్స్‌ కూడా జారీ చేశాయి..దాదాపు అన్ని స్కూళ్లు సోమవారం నుండి ప్రారంభమయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి..
Published by:yveerash yveerash
First published: