రోజులు మారుతున్నాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. 5G రంగంలోకి అడుగుపెట్టాం. అయినా కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైన కూడా వాటిని ముందుగా పసిగట్టలేకపోతున్నాం. అఘాయిత్యం జరిగాక ఆ తరువాత నిందితుడిని అరెస్ట్ చేయడం పరిపాటిగా జరుగుతుంది. కానీ ఆ దారుణాన్ని ముందే పసిగట్టి మానవ మృగాల నుండి అమ్మాయిలను రక్షించే టెక్నాలజీ ప్రస్తుతం ఉంది. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో చాటింగ్ కు ఇచ్చిన ప్రాధాన్యత సొంత రక్షణ కోసం ఆయుధంలా మార్చుకోలేకపోతున్నారు. అయితే చాటింగ్ పై పెట్టె దృష్టి కాస్త అమ్మాయిలకు రక్షణగా ఉండే షీ టీమ్స్, డయల్ 100, డివిజినల్ షీపై దృష్టి పెడితే పోకిరీల ఆగడాల నుండి బయటపడవొచ్చు.
వాట్సప్ మహిళలకు ఆయుధం..ఎలా అంటే?
సాధారణంగా మనం వాట్సప్ ను చాటింగ్, కాల్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తుంటాం కానీ వాట్సప్ మహిళల రక్షణకు ఓ ఆయుధంగా పని చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో మహిళలపై పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆ ఆగడాలకు చెక్ పెట్టడానికి వాట్సప్ ఎంతో హెల్ప్ అవుతుంది. మహిళలు వేధింపులకు గురి అయినప్పుడు 9490617444కు సందేశం పంపించడం వల్ల వారిని లైంగిక వేధింపుల నుండి బయటకు తీసుకొస్తాయి. అలాగే షీ టీమ్స్, డయల్ 100, డివిజినల్ షీ మహిళలకు తోడుగా నిలబడతాయి.
ఆ సమస్య వస్తుందన్న భయంతోనే ఇలా..
చాలా మంది మహిళలు తమకు పోకిరీల నుండి ఇబ్బందులు వచ్చినా బయటకు చెప్పుకోరు. ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేద్దామంటే ఆకతాయిలు ఏమైనా చేస్తారనే భయంతో స్టేషన్ మెట్లు కూడా ఎక్కడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాట్సప్ ద్వారానే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుస్తుంది. సైబరాబాద్ షీ టీంకు 100 ఫిర్యాదులు వస్తే అందులో 75 ఫిర్యాదులు కేవలం వాట్సప్ ద్వారానే రావడం గమనార్హం. అలా వచ్చిన ఫిర్యాదులకు అధికారులు స్పందించి ఆ బాధితులను బయటకు తీసుకొస్తున్నారు. మహిళలు సోషల్ మీడియాలో ఎవరికీ తెలియకుండా కంప్లైంట్ చేసే అవకాశం ఉండడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వేధింపుల సంఖ్య తగ్గుముఖం..
అయితే సోషల్ మీడియాలో ఫిర్యాదులు పెరగడంతో మహిళల్లో అవగాహన పెరిగిపోయింది. దీనితో పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అవగాహన పెరుగుతున్న కొద్దీ క్రమంగా వేధింపుల సంఖ్య తగ్గుతుంది. మహిళలు వేధింపులకు గురైతే 9490617444 నెంబర్ కు వాట్సప్ ద్వారా సందేశం పంపవచ్చు. లేదంటే డయల్ 100 కు కాల్ చేయొచ్చు. షీటీంకు ఈ మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. cyberabad@gmail.com లేదా Twitter (@sheteamcybd), Facebook ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.