తెలంగాణ (Telangana )లో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (TRS) ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (MP Rahul Gandhi)ని రప్పించింది. ఈ నేపథ్యంలో నేడు ఎంపీ రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. శుక్రవారం వరంగల్ రైతు సంఘర్షణ సభ (warngal Raithu sangharshana Sabha)లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ (Hyderbad)లోని తాజ్ కృష్ణలో రాహుల్ బస చేశారు. ఇక నేడు రాహుల్ గాంధీ (Rahul gandhi) చంచల్ గూడ జైలు (Chanchal guda jail)లో ఎన్ఎస్యూఐ (NSUI leaders) నాయకులను పరామర్శించారు.
రాహుల్ గాంధీ ములాఖత్..
చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (B Venkat)తో సహా 18 మంది నాయకులను రాహుల్ గాంధీతో ములాఖత్ అయ్యారు. దాదాపు 15 నిమిషాలతో పాటు ఈ భేటీ సాగింది. పార్టీ (Congress party) తరఫున వారికి రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. రాహుల్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్ఎస్యూఐ నాయకుల వద్దకు వెళ్లారు. చంచల్‌గూల్ జైలులో రాహుల్‌తో పాటు ఒక్కరికి మాత్రమే ఎన్ఎస్యూఐ నాయకులతో ములాఖత్ అయ్యేందుకు అధికారులు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేవలం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఒక్కరే రాహుల్‌తో వెళ్లారు.
అక్రమంగా అరెస్ట్ చేశారని..
ఇక, చంచల్ గూడ జైలు వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth reddy), ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఓయూకు రావాలని దళిత, గిరిజన విద్యార్థులు ఆహ్వానించారని చెప్పారు. కానీ ఓయూ వీసీ (OU VC) అనుమతి ఇవ్వలేదన్నారు. ఓయూ వీసీని పర్మిషన్ అడిగేందుకు వెళ్తే ఎన్ఎస్యూఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. ఓయూకు వెళ్లకుండా రాహుల్‌ను కావాలనే అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ (CM KCR) పతనానికి ఇది నాంది అని అన్నారు. నిబంధనల ప్రకారం.. ప్రతి ఒక్క ముద్దాయి ముగ్గురిని కలవవచ్చని చెప్పారు. చంచల్‌గూడ జైలు నుంచి బయలుదేరిన రాహుల్.. గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీభవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. పార్టీ మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్యక్రమం అనంతరం గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. కాగా, నిన్న జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభకు చాలామంది తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా జోష్ పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Rahul Gandhi, TS Congress