Home /News /telangana /

HYDERABAD ADVANCED MEDICAL SERVICES LASER TREATMENT FOR DERMATOLOGISTS IN HYDERABAD GANDHI SNR

Hyderabad:ఫ్రీగా లేజర్ ట్రీట్‌మెంట్, అలర్జీ,స్కిన్‌ డిసీజస్‌కి అత్యుత్తమ వైద్యం

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

HYDERABAD: చర్మవ్యాధులతో బాధపడే పేదల కోసం గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ హాస్పిటల్‌లో ఖర్చుతో కూడుకున్న లేజర్ ట్రీట్‌మెంట్, ఆపరేషన్‌ వంటి సేవలను ఉచితంగా చేసేందుకు నిష్ణాతులైన వైద్యబృందం ఉంది. పిల్లల కోసం ప్రత్యేక పిడియాట్రిక్ డెర్మటాలజీ ట్రైనింగ్ సెంటర్‌ కూడా ఉంది.

ఇంకా చదవండి ...
తెలంగాణలోని సర్కారు దవఖానాలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. జంటనగరాల ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో ఎంతో పేరు గడించింది సికింద్రాబాద్‌(Secunderabad)లోని గాంధీ హాస్పిటల్. ప్రస్తుతం ఆదే ఆసుపత్రి చర్మవ్యాధులు సోకిన వారికి అత్యాధునిక యంత్రాలతో మెరుగైన చికిత్స (Advanced Medical Services)చేసేందుకు ప్రత్యేక వైద్యసేవలందిస్తోంది. చర్మ వ్యాధిగ్రస్తుల కోసమే గాంధీ హాస్పిటల్‌(Gandhi Hospital)లోని ఔట్‌ పేషెంట్‌ విభాగంలోని రెండో అంతస్తులో రూమ్‌ నెంబర్ 74లో చర్మ, లైంగిక, కుష్టు వ్యాధుల చికిత్స విభాగం ఉంది. గతంలో సాధారణ వైద్యసేవలందించే ఈ స్కిన్‌ హాస్పిటల్‌లో ప్రస్తుతం కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. చర్మవ్యాధిగ్రస్తుల కోసం ఆపరేషన్ థియేటర్‌ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఏ ప్రభుత్వ వైద్యశాలల్లో లేనటువంటి లేజర్ ట్రీట్‌మెంట్‌ (Laser Treatment)విధానాన్ని కూడా ఇక్కడ రోగులకు అందుబాటులో ఉంచారు. సీఓ2లేజర్‌(Co2 laser) , డైయోడ్‌(Diode), ఎన్‌డీ యోగ్‌ (ND Yog)లాంటి అత్యాధునిక యంత్రాలతో చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమలు, స్కార్‌, అవాంఛిత రోమాల తొలగించడం, చర్మం తెల్లగా మారేందుకు లేజర్‌ చికిత్సను చేస్తున్నారు. ఇతర ప్రైవేట్‌ వైద్యశాలల్లో వేలాది రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని ఇక్కడ పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.

చర్మవ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం..
ఇక చర్మవ్యాధులు సోకిన చిన్నారులు, పసిపిల్లలకు ప్రత్యేకంగా పిడియాట్రిక్ డెర్మటాలజీ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే గాంధీ ఆసుపత్రిలోనే తొలిసారిగా ఈ పిల్లల చర్మవ్యాధుల ట్రీట్‌మెంట్‌ కేర్ సెంటర్‌ని అందుబాటులోకి తెచ్చారు. పిడియాట్రిక్‌ డెర్మటాలజీ శిక్షణా కేంద్రాన్ని 2019లో ఐఏడీవీఎల్‌ ద్వారా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల్లో వచ్చే చర్మ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదని ఈ సెంటర్‌ని మరింత ఆధునీకరించారు. శిశువులు, చిన్నారుల్లో ఎక్కువగా గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు వస్తుంటాయి. వాటిని ప్రాథమిక దశలోనే నివారించేందుకు వీలుగానే గాంధీలోని ఈ పిడియాట్రిక్ డెర్మటాలజీ సెంటర్‌ ఉచితంగా సేవలందిస్తోంది.

పిల్లలు, శిశువులకు ప్రత్యేక విభాగం..
చర్మవ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగులను పరిక్షీంచడానికి పదకొండు మంది ప్రొఫెసర్లు ఉన్నారు. సీరియస్, క్రిటికల్, సర్జికల్‌ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ఆరుగురు సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లతో పాటు 26 మంది పీజీ వైద్యవిద్యార్థులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు నిపుణులైన వైద్యులు, ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌తో పాటు మేజర్‌, మైనర్‌ పరికరాలతో కలిపి ప్రతిరోజు ఇరవైకి పైగా కెమికల్‌, కాస్మెటాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు ఇక్కడి డాక్టర్లు.
Published by:Siva Nanduri
First published:

Tags: HYDERABAD GANDHI HOSPITAL, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు