హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ఆమె సాధారణ గృహిణి కాదు..వెరీ స్ట్రాంగ్‌ విమెన్..ఇట్స్ ట్రూ..

Hyderabad: ఆమె సాధారణ గృహిణి కాదు..వెరీ స్ట్రాంగ్‌ విమెన్..ఇట్స్ ట్రూ..

Photo Credit:Instagram

Photo Credit:Instagram

Hyderabad:బాగా చదువుకోలేదని బాధపడలేదు ఆమె. కష్టాలను అధిగమిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని నిరూపించుకుంది. తాను పొందలేకపోయిన చదువును పిల్లలు, చెల్లెళ్లకు చెప్పిస్తూ ఆదర్శవంతమైన మహిళగా గుర్తింపు తెచ్చకుంది.

బాగా చదువుకోలేదన్న ఆలోచన ఆమెలో పట్టుదలను పెంచింది. జీవితంలో ఎలాగైనా గొప్పగా బ్రతకాలన్న లక్ష్యం..తన బిడ్డలకు ఉన్నత చదువులు చెప్పించాలన్న ముందుచూపు ఆమెను మరింత బలవంతురాలిని చేసింది. హైదరాబాద్‌ (Hyderabad)లోని సైదాబాద్‌కి చెందిన యెద్దలపెల్లి ఆదిలక్ష్మి( Adilaxmi)ఓ సాధారణ గృహిణి(House wife). ఇద్దరు పిల్లల తల్లి. కేవలం నాల్గో తరగతి (Fourt class)వరకే చదువుకున్న ఆదిలక్ష్మి..ఇప్పుడు సాధారణ గృహిణి కాదు..స్ట్రాంగ్ విమెన్(Strong Women) అని నిరూపించుకుంది. భర్త భద్రం(Bhadram) మెకానిక్(Mechanic) కావడంతో అతనితో కలిసి ఆటోలు(Auto) , కార్లు(Cars),లారీలు (Lorry), ట్రాక్టర్‌(Tractor) టైర్లకు పంచర్లు( Tire Punctures)వేయడం నేర్చుకుంది. 31సంవత్సరాల(31Years) ఆదిలక్ష్మి చేస్తున్న పనిని దైవంగా భావిస్తూ ఫ్లాట్ టైర్లు బిగించడంలో ఎంతో నైపుణ్యం సంపాధించింది. మగవాళ్లకే కష్టతరంగా ఉండే ఉపాధిని ఎంచుకున్న ఆదిలక్ష్మి పిల్లల్ని, తన చెల్లెళ్లను బాగా చదివించాలన్న కోరికతో ..భర్తతో కలిసి జీవితంలో ఎదురయ్యే కష్టాలును చిరునవ్వుతో స్వాగతిస్తూ వాటిని అధిగమించడానికి నిత్యం చెమటను దారపోస్తోంది. ఇద్దరు ఆడపిల్లలను పోలీసు(Police) అధికారులుగా చూడాలన్న తన కోరికను నెరవేర్చడం కోసం పట్టుదలతో స్థాయికి మించిన బరువును తలకెత్తుకొని సాదాసీదాగా జీవిస్తోంది.

స్ట్రాంగ్‌ విమెన్..

ఎవరి జీవితంలోనైనా మొదట్లో ముళ్ల బాట ఆ తర్వాతే పూలబాట అన్నట్లుగానే మొదలైంది ఆదిలక్ష్మి మెకానికల్ లైఫ్. ఆడవాళ్లేంటి ఈ పనేంటి అని అవమానంగా చూసే చూపులను శభాష్‌ ఆదిలక్ష్మి అనేలా తన టాలెంట్‌ని, శ్రమని పెట్టుబడిగా పెట్టి ఇద్దరు చెల్లెలను చదివించింది. ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు నర్సుగా పనిచేస్తుండగా మరో సోదరి డిగ్రీ పూర్తి చేసింది.

వర్క్ ఈజ్ వర్‌షిప్ ..

జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకెళ్తున్న ఆదిలక్ష్మిలోని కష్టపడే లక్షణం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆకర్షించింది. మహిళా మెకానిక్‌గా మారిన ఆదిలక్ష్మికి శ్రమను తగ్గించేందుకు లారీ టైర్లు మార్చే యంత్రాన్ని ఆదిలక్ష్మికి బహుమతిగా ఇచ్చారు. అయితే ఆదిలక్ష్మి ఆ యంత్రాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ఎందుకంటే ఆ యంత్రాన్ని ఉపయోగించాలంటే కావాల్సిన విద్యుత్‌ సప్లై తన షాపులో లేకపోవడంతో అలాగే చేతి పని ముట్లతోనే లారీలు, ట్రాక్టర్‌, కార్లు, హెవీ వెహికల్స్‌ టైర్లను సునాయాసంగా మార్చేస్తోంది ఆదిలక్ష్మి.

ధైర్యే సాహసే లక్ష్మి..

మహిళా పంచర్‌ మెకానిక్‌గా మారిన ఆదిలక్ష్మి సమాజంలో లోపాలు, నామూషి పడే వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న షెల్టర్‌లో సింగిల్-ఫేజ్ విద్యుత్తుతో నడిచే షాపునే నడిపిస్తున్నారు. ఆదిలక్ష్మి సాహసోపేతమైన నిర్ణయాన్ని, చేస్తున్న కష్టాన్ని ఎన్నో స్వచ్చంద సంస్థలు గుర్తించాయి. ఆమెకు బహుమతులు,అవసరమైన యంత్రాలను సమకూర్చాయి.

Published by:Siva Nanduri
First published:

Tags: Greater hyderabad, VIRAL NEWS

ఉత్తమ కథలు