HYDERABAD ADDRESSES STARTUP COMPANIES 515 MILLION DOLLARS INVESTMENTS IN LATEST REPORT BK EVK
Hyderabad: ఇది హైదరాబాద్ సత్తా.. 933 స్టార్టప్‌లు.. 515 మిలియన్ డాలర్ల నిధులు
హైదరాబాద్ సైబర్ టవర్స్ (ఫైల్ ఫోటో)
Startups in Hyderabad | గత ఏడాది హైదరాబాద్ లో మొదలైన స్టార్టప్ కంపెనీలు దుమ్ము లేపాయి. గతంలో ఎన్నడు లేని విధంగా నిధులను సమీకరించి రికార్డ్ సృష్టించాయి. హైదరాబాద్ నయా స్టార్టఫ్ కంపెనీలకు చిరునామాగా మారింది. గడిచిన మూడేళ్లలో దాదాపు 933 స్టార్టప్ కంపెనీలు నగరంలో స్థాపించబడ్డాయాని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
గత ఏడాది హైదరాబాద్ (Hyderabad) లో మొదలైన స్టార్టప్ (Startup) కంపెనీలు దుమ్ము లేపాయి. గతంలో ఎన్నడు లేని విధంగా నిధులను సమీకరించి రికార్డ్ సృష్టించాయి. హైదరాబాద్ నయా స్టార్టఫ్ కంపెనీలకు చిరునామాగా మారింది. గడిచిన మూడేళ్లలో దాదాపు 933 స్టార్టప్ కంపెనీలు నగరంలో స్థాపించబడ్డాయి. 2019 నుంచి 2021 మధ్యలో నగరంలో ఈ స్టార్టప్ కంపెనీలు నగరంలో వెలిశాయి. ఒక వైపు ఉద్యోగ అవకాశాలు నగరంలో పుష్కకలంగా ఉన్నప్పటికి.. నగరంలో ఉన్న యువత సొంత కాళ్ల పై నిలబడడానికే ఎక్కువ మొగ్గుచూపారని తాజా నివేధికలు చెబుతున్నాయి.
933 స్టార్టఫ్ కంపెనీలు దాదాపు 515 మిలియన్ డాలర్ల నిధులను గడిచిన మూడేళ్లల్లో సేకరించి రికార్డు సృష్టించాయి.దీంతో నగరంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఈ మూడేళ్లలో అధిక స్థాయి వృద్ధిని సాధించింది. IIT-H, IIT-H వంటి సాంకేతిక-కేంద్రీకృత సంస్థలతో పాటు T-Hub, WE Hub వంటివి స్థాపించడం ద్వారా ప్రభుత్వం కూడా స్టార్టఫ్ కంపెనీలకు ఊతమిచ్చింది. దీంతో పాటు RICH, TASK, TSIC, TWorks వంటి ఇన్నోవేషన్-లీడ్ ఎంటిటీలు ముందుకొచ్చి నగరంలో స్థాపించిన స్టార్టప్ లకు యూతమిచ్చాయని అంటున్నారు నిపుణులు.
ఇదిలా ఉంటే తాజా నివేధిక ప్రకారం, 2019 నుండి 2021 వరకు గత మూడేళ్లలో నగరంలో ప్రారంభిచిన 933 స్టార్టఫ్ లకు మన దేశంతోపాటు ఇతర దేశాల నుంచి కూడా ఆర్ధిక సహాకారం అందించబడ్డాయి. ఇలా ఈ మూడేళ్లల్లో దాదపు $515 మిలియన్లు డాలర్లు నగరంలో ఉన్న స్టార్టఫ్ లపై పెట్టుబడులు పెట్టబడ్డానికి. అయతే 2016 నుంచి 2018 మధ్యకాలంలో నగరంలో ప్రారంభించిన స్టార్టప్‌ల సంఖ్య 1,438 ఉన్నప్పటికి అవి కేవల $274 మిలియన్లు డాలర్ల ఫండింగ్ ను మాత్రమే ఆకర్షించగలిగాయి.
కొత్త ఐడియాలతో పెట్టుబడులు..
ట్రాక్ఎక్స్ఎన్ వార్షిక నివేదిక ప్రకారం, 2019-21లో ప్రారంభించిన మొత్తం స్టార్టప్‌ల మార్కెట్ వాటా 7 శాతంగా ఉంది, అయితే ఈక్విటీ నిధుల కోసం మార్కెట్ వాటా 1 శాతంగా ఉంది. దీంతో దేశంలో ప్రారంభించబడిన స్టార్టఫ్ లకు అందుతున్న నిధుల పట్టికలో హైదరాబాద్ ఐదో స్థానం నిలిచింది. దేశవ్యాప్తంగా పెట్టుబడులు 2020లో $13 బిలియన్ల నుండి 2021లో $35 బిలియన్లకు మూడు రెట్లు పెరిగాయి. ఈ సంఖ్య 2020లో 16 నుండి 2021లో 41కి పెరిగింది. అయితే దేశవ్యాప్త జాబితాలో ఢిల్లీ (Delhi) 4,413 స్టార్టఫ్ లత $18,830 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించి జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త గా నగరంలో ప్రారంభిస్తోన్న స్టార్టఫ్ కంపెనీలకు అన్ని విధలా ఆదుకుంటున్నాయి. దీంతో యువత తమ నయా ఐడియాలతో ప్రపంచ వ్యాఫ్తంగా ఉన్న పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.