HYDERABAD ACTRESS HEMA SERIOUS ON TV CHANNEL CRIME REPORTER IN HYDERABAD SB
Drugs Case: నా పేరు ఎందుకు చెప్పారు... ప్రముఖ ఛానల్ రిపోర్టర్‌పై నటి హేమ సీరియస్
నటి హేమ
నిన్న రాత్రి సిటీలో ఓ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీలో బడా బాబుల పిల్లలు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో సినీ రాజకీయ ప్రముఖుల వారసులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో నటి హేమ పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇవాళ ఉదయం నుంచి మీడియాలో హాట్ న్యూస్ హైదరాబాద్ రేవ్ పార్టీ. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన రేవ్ పార్టీలో సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన పిల్లలు పట్టుబడ్డారు. అర్థరాత్రి పబ్ పై దాడి చేసిన పోలీసులు పార్టీలో ఉన్న దాదాపు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో మెగా డాటర్ నీహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ కేసులోనే.. నటి హేమ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ క్రైమ్ రిపోర్టర్ నటి హేమ పేరును ప్రస్తావించాడు. దీంతో ఈ విషయం తెలిసుకున్న హేమ ఆ ఛానల్ యాజమాన్యంతో పాటు రిపోర్టర్‌పై మండిపడింది.
అతనికి కాల్ చేసి చెడామడా వాయించింది. అయితే సదరు రిపోర్టర్ కూడా హేమతో చాలా దురుసుగా మాట్లాడారని ఆమె ఆరోపిస్తోంది. అతనికి సంబంధించిన కాల్ రికార్డింగ్ కూడా తన దగ్గర ఉందని చెప్పింది. . ఏకంగా డ్రగ్ కేసులో పట్టుబడినట్లు ఆమె పేరు రావడంతో హేమ వెంటనే సదరు ఛానల్ రిపోర్టర్‌కు ఫోన్ చేసింది. ఆమెనే ఆ రిపోర్టర్ గట్టిగా దబాయించడంతో ఆమె మీడియా ముందుకు వచ్చింది. మహిళ అయిన తన పేరును ఇలాంటి కేసుల్లో ఎలా లాగుతారు అంటూ.. హేమ మండిపడింది. రిపోర్టర్ గాడు అంటూ సదరు రిపోర్టర్ పై సీరియస్ అయ్యింది. దీంతో అక్కడున్న మిగతా మీడియా ప్రతినిధులంతా హేమకు అడ్డు తగిలారు. రిపోర్టర్లను అలా అనడం సరికాదన్నారు.
దీంతో హేమ కూడా అక్కడున్న మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగింది. తాను అందర్నీ అనడం లేదని... తన పేరును ప్రస్తావించిన రిపోర్టర్‌ను మాత్రమే అంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. మరోవైపు ఇదే డ్రగ్స్ కేసు విషయమై మరో బడా ఫ్యామిలీ కూడా తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో తమవారికి సంబంధం లేదని ఓ పొలిటికల్ ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో సింగర్ రాహుల్ సిప్లి గంజ్, నాగబాబు కుమార్తె నిహారికతో పాటు గల్లా జయదేవ్ కుమారుడు ఉన్నారని వస్తున్న వార్తలను గల్లా ఫ్యామిలీ ఖండించింది. ఈ కేసుతో తమవారికి ఎలాంటి సంబంధం లేదని గల్లా ఫ్యామిలీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.