హోమ్ /వార్తలు /తెలంగాణ /

Manchu Manoj : మంచు మనోజ్‌కి మళ్లీ పెళ్లి ..? భూమా మౌనికరెడ్డితోనేనంటూ వార్తలు .. వైరల్ అవుతున్న ఫోటోలు

Manchu Manoj : మంచు మనోజ్‌కి మళ్లీ పెళ్లి ..? భూమా మౌనికరెడ్డితోనేనంటూ వార్తలు .. వైరల్ అవుతున్న ఫోటోలు

(manoj,mounikareddy)

(manoj,mounikareddy)

Manchu Manoj: సినీ నటుడు మంచు మనోజ్‌ మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని మంచు మనోజ్‌ రెండో వివాహం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వార్తే కాదు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సినీ నటుడు మంచు మనోజ్‌(Manchu Manoj)మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని మంచు మనోజ్‌ రెండో వివాహం(Second marriage)చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వార్తే కాదు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్‌కి గతంలోనే వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం విడాకులు (Divorce)తీసుకున్నారు. అయితే ఇప్పుడు వివాహం చేసుకుంటారని చెప్పుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కర్నూలు(Kurnool)జిల్లాలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. మంచు మనోజ్‌ చేసుకోబోయే అమ్మాయి సోదరి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.

Janhvi Kapoor : డ్రెస్సుల బరువు మోయలేనంటున్న జాన్వీకపూర్ .. పొట్టి దుస్తుల్లో ఫోటోషూట్‌


మంచు మనోజ్‌కి మళ్లీ పెళ్లి..?

నిర్మాత, నటుడు మోహన్‌బాబు రెండో కుమారుడు, సినీ నటుడు మంచు మనోజ్‌ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకోబోతున్నారనే వార్త బాగా ప్రచారమవుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నేపధ్యం కలిగిన భూమానాగిరెడ్డి,శోభానాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డినే మనోజ్‌ వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి కారణం హైదరాబాద్‌లో గణేష్ మండపానికి మంచు మనోజ్‌తో పాటు భూమా మౌనికారెడ్డి ఇద్దరూ కలిసి పూజలు చేసిన ఫోటోలు బయటకు రావడమే ఈ వార్తకు బలాన్ని చేకూర్చుతున్నాయి. అంతే కాదు ఈఫోటోల్లో ఇద్దరూ కలిసి హారతి ఇవ్వడం, పక్కనే నడుచుకుంటూ రావడంతో మంచు మనోజ్‌ అభిమానులు మ్యారేజ్ ఫిక్సైపోయినట్లుగా భావిస్తున్నారు. సోషల్ మీడియా గ్రూప్‌లలో కాంగ్రాట్స్ చెబుతున్నారు.

భూమా మౌనికతో మనోజ్‌ ఫోటోలు..

గతంలో మనోజ్‌ ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి ఇష్టంతోనే మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ పెద్దగా సినిమాల్లో కూడా నటించలేదు. మరోవైపు భూమా మౌనికారెడ్డికి కూడా మొదట బెంగుళూరుకు చెందిన గణేష్‌రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. రెండేళ్ల క్రితమే మౌనికారెడ్డి గణేష్‌రెడ్డితో విడాకులు తీసుకున్నారు.

Eesha Rebba: బ్లూ కలర్ స్లీవ్‌ లెట్‌ డ్రెస్‌లో ఈషా రబ్బా అందాలు .. సొగసులు చూపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ


వైరల్ అవుతున్న వార్త, ఫోటోలు..

మౌనికారెడ్డి మొదటి భర్త నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే చెన్నైలని ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఓ విల్లాస్‌లో ఉంటున్నట్లుగా సమాచారం. రీసెంట్‌గా హైదరాబాద్‌కు వచ్చినట్లుగా..కలిసే ఉంటున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే గణేష్‌ మండపానికి మౌనికారెడ్డితో కలిసి వచ్చిన మనోజ్‌ని పెళ్లి విషయంపై ప్రస్తావిస్తే తన వ్యక్తిగత విషయమని..సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. అయితే మంచువారబ్బాయి వివాహ వార్త , ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నప్పటికి ఎవరూ దీన్ని ఖండించకపోవడంతో నిజమేనన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Manchu Manoj, Tollywood actor

ఉత్తమ కథలు