Home /News /telangana /

HYDERABAD ACB ARRESTED KAPRA CIRCLE DE MAHALAKSHMI FOR SCOLDS ACB OFFICIALS FOR TAKING RS 20000 BRIBE VB

Corruption: ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాల్సిందే.. ఏసీబీ అధికారులకు చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి.. వివరాలు ఇలా..

ఏసీబీ అధికారులకు చిక్కిన డీఈ

ఏసీబీ అధికారులకు చిక్కిన డీఈ

Corruption: జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ డీఈ మ‌హాల‌క్ష్మి అవినీతి నిరోధ‌క శాఖకు చిక్కారు. జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న మ‌హిళా స్వీప‌ర్ సాలెమ్మ ఇటీవ‌ల‌ అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమె ఉద్యోగం తన భర్తకు ఇచ్చేందుకు డీఈ లంచం డిమాండ్ చేశారు. ఓ హోట‌ల్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.

ఇంకా చదవండి ...
    కొన్ని పనులు కావాలంటే అధికారులు లంచాలు డిమాండ్ చేస్తారు. అయితే ఇలా లంచాలు తీసుకుంటున్న అధికారులు ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులకు చిక్కుతూనే ఉంటుంన్నారు. తాజాగా ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. తమ కింద స్థాయి ఉద్యోగి చనిపోవడంతో ఆమె ఉద్యోగం తన భర్తకు ఇచ్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ పరిధిలో ప‌నిచేస్తున్న స్వీపర్ సాలెమ్మ ఇటీవ‌ల‌ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె ఉద్యోగం అతని భర్త రాములుకు వచ్చింది. రాములుకు ఆ ఉద్యోగం ఇచ్చినందుకు తనకు రూ.20వేలు లంచం ఇవ్వాలని డీఈ డిమాండ్ చేశారు. తన పేద కుటుంబం అని చెప్పినా వినలేదు. ఆ డబ్బును మ‌ల్లాపూర్‌లోని ఓ హోట‌ల్‌కి వచ్చి తమ అసిస్టెంట్ విజయ్ కు ఇవ్వాలని చెప్పింది.

    ఈ విషయాన్ని రాములు తన కొడుకుకు చెప్పగా..అతను ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో హోటల్ కి డబ్బులు తీసుకొని వెళ్లి అసిస్టెంట్ కు ఇస్తున్న క్రమంలో అధికారులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా డీఈ మహాలక్ష్మి తీసుకోమంటేనే తీసుకున్నానని దీంట్లో నా తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు. అలా డీఈ మహాలక్ష్మి లంచావతారం విషయం బయటపడింది.

    దీంతో మహాలక్ష్మి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ACB అధికారులు. ఏసీబీ డీఎస్సీ సూర్యనారాయణ నేతృత్వంలోని బృందం డీఈ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు భారీగా నగదు..బంగారం పట్టుబడింది. డీఈ లంచం డిమాండ్ చేసిన విషయం రుజువైందని ఏసీబీ డీఎస్పీ సూర్యనాయణ మీడియాకు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: ACB, Bribe, Capra Circle, GHMC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు