రేషన్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. రేషన్ కార్డు ద్వారా సబ్సిడీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, గోదుమలు వంటి నిత్యావసర సరుకులు అందిస్తాయి. అర్హులకే లబ్ధి చేకూర్చడంతో పాటు, నఖిలీ రేషన్ కార్డులను గుర్తించవచ్చనేది కేంద్రం అభిప్రాయం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డును లింక్ చేయడానికి తొలుత కేంద్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది.అయితే తాజాగా ఈ డెడ్‌లైన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఆధార్, రేషన్ కార్డ్ లింక్ చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించింది.
రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాలనుకుంటున్న వారు ముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్‌కు వెళ్లాలి. అందులో ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్ చేసి రేషన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీనీ ఎంటర్ చేయాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మరోవైపు.. రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటివి రేషన్ ఆఫీసుకు లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా రేషన్ షాపులో అందిస్తే సరిపోతుంది. వారు ఆధార్, రేషన్ కార్డు లింక్ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AADHAR, Hyderabad, Local News, Ration card