HYDERABAD A YOUNG MAN KIDNAPS A GIRL AND MARRIES HER IN VIKARABAD DISTRICT VB
Minor Girl Kidnap: ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు అతడు చేసిన చర్యకు పోలీసులు ఆశ్చర్యపోయారు..
ప్రతీకాత్మక చిత్రం
Minor Girl Kidnap: ఈ మధ్య కాలంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా ఇటువంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా వీళ్లల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇవే కాకుండా.. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటనలో ఓ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు ఆమెను ఏం చేశాడంటే..
ఈ మధ్య కాలంలో హత్యలు(Murder), అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా ఇటువంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇవే కాకుండా.. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. మొన్న జరిగిన సైదాబాద్ ఘటన కూడా అలాంటిదే. అయితే ఓ బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్(Kidnap) చేసి.. పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు విద్యార్థులు అంతా చదువుకునేందుకు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్తున్నారు.
ఇలా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన ఓ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 12న ఆ బాలిక ఇంటి నుంచి బటయకు వెళ్లింది. కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కంగారు పడిపోయిన ఆ బాలిక తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన శ్రీనుపై అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు దిమ్మతిరిగిపోయే న్యూస్ తెలిసింది. కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఆ యువకుడు ఆ బాలికను పెళ్లి చేసుకున్నట్లుగా గుర్తించారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించి నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్‌లోని సైదాబాద్, సింగరేణి కాలనీలో చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య, అత్యాచారం చేసి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత హైదరాబాద్ లోనే మరో ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌హాట్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. స్థానికంగా ఉండే ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు బాలిక బంధువులు ఆరోపించారు.
సుమిత్ అనే యువకుడు ఖాళీగా ఉన్న దుకాణం షేటర్లోకి చిన్నారిని లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో.. అక్కడికి వెళ్లిన స్థానికులు.. సుమిత్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల అలర్ట్‌తో చిన్నారి సేఫ్‌గా బయటపడింది. తప్పించుకున్న నిందితుడిని అత్తాపూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హబీబ్‌నగర్ పరిధిలో నమో దైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో అత్యాచారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వారి తల్లిదండ్రుల పిల్లలను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటే మంచిది.
కఠినమైన చట్టాలు కీచక కాండలను ఆపడం లేదని సర్వేల్లో స్పష్టం అవుతోంది. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన శిక్షలతో కూడిన చట్టాలను తీసుకు వచ్చినా తెగించిన మగాళ్లు వాటికి భయపడటం లేదని పోలీసుల గణాంకాలు కూడా చెబుతున్నాయి. ప్రత్యేకించి దేశ రాజధానిలో జరుగుతున్న అకృత్యాల వివరాలను బట్టి చూస్తే ఈ విషయంపై స్పష్టత వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతండటంతో హైదరాబాద్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.