Kidnap: ప్రియురాలికి నిశ్చితార్ధం జరిపించారు.. తెల్లారేసరికి ఆ వ్యక్తి కిడ్నాప్.. పాత బస్తీలో కలకలం రేపిన ఘటన
ప్రతీకాత్మక చిత్రం
Kidnap: వారిద్దరు ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. పెద్దలకు ఈ ప్రేమ వ్యవహారం ఇష్టం లేక అమ్మాయికి వేరే అతడితో నిశ్చితార్ధం జరిపించారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియుడు పియురాలికి కాబోయేవాడిని కిడ్నాప్ చేశాడు.
ప్రేమ వివాహం అయినా పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు వారి ఇష్టాలను పెద్దలు అంగీకరిస్తేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దలతో చెప్పుకుంటే సగం బాధ తీరుతుంది. అయితే పెళ్లి విషయానికి వచ్చే సరికి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. అయితే ఇక్కడ వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఆ పని జరగలేదు. నదీమ్ ఖాన్ అనే యువకుడికి ఇటీవలే ఆ అమ్మాయితో వారి తల్లిదండ్రులు నిశ్చితార్థం జరిపించారు. ఇది జరిగిన మరుసటి రోజే అతను కిడ్పాప్ కు గురయ్యాడు. అసలేం జరిగిందంటే.. తను పెళ్లి చేసుకోవాల్సిన ప్రియురాలిని వేరే వ్యక్తి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ బాధను భరించలేక ప్రియురాలికి కాబోయేవాడిని ప్రియుడు కిడ్నాప్ చేశాడు.
ఈ ఘటన పాతబస్తీలోని మైలార్దేవ్పల్లి శాస్త్రి పురం కింగ్స్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక కింగ్స్ కాలనీలో నివాసం ఉండే నదీమ్ ఖాన్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
నదీమ్ ఖాన్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తున్న దృశ్యం (image credit - youtube)
నిన్న రాత్రి వేళ నదీమ్ ఖాన్ ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. అతడిని ఆపి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ కిడ్నాప్ వ్యవహారంపై బంధువుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన మైలార్దేవ్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.