అతడికి ఎస్సై కావాలనే కోరిక.. ఆ ప్రయత్నంలో ఉండగా.. సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

Selfi Video: అతడు ఎస్సై కావాలనే కోరిక బలంగా ఉండేది. దాని కోసమే హైదరాబాద్ కు వచ్చాడు. ఓ గదిని అద్దెకు తీసుకొని స్నేహితులతో కలిసి చదువుకుంటుంన్నాడు. కట్ చేస్తే.. అతడు ఓ రోజు రాత్రి సెల్పీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే..

 • Share this:
  అతడు ఎస్సై కావాలనే కోరిక బలంగా ఉండేది. దాని కోసమే హైదరాబాద్ కు వచ్చాడు. ఓ గదిని అద్దెకు తీసుకొని స్నేహితులతో కలిసి చదువుకుంటుంన్నాడు. కానీ అతడు అప్పటికే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య ఏం వాగ్వాదం చేసుకుందో తెలియదు కానీ.. అతడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పటి లాగే తన స్నేహితులు బయటకు వెళ్లి వచ్చి రూం తలుపులు కొడుతుండగా అస్సలు తీయలేదు. అనుమానం వచ్చి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా తన స్నేహితుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఆధారాలను సేకరించారు. అందులో తన ఫోన్ లో రికార్డు చేసిన వీడియో ప్రకారం ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్‌ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్‌ (29) హైదరాబాద్‌కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. రాత్రి రూమ్మేట్‌ భార్గవ్‌ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయక పోవడంతో పై పోర్షన్‌లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు.

  వీడియో లో నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుందంటూ.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. మృతుడి బాబాయ్‌ శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: