Home /News /telangana /

HYDERABAD A YOUNG MAN CHEATED ON HER BY MAKING HER PREGNANT IN THE BELIEF THAT HE WOULD MARRY HER VB

Crime News: ఈ మహిళ పోరాడి అనుకున్నది సాధించింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ప్రణీత (ఫైల్)

ప్రణీత (ఫైల్)

Crime News: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు ఓ యువకుడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది సదరు యువతి. ఈ ఘటన హైదరాబాద్ లోని బోడుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    అతడు ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి (Marriage) కూడా చేసుకుంటానని నమ్మించాడు. ఇలా ఐదు సంవత్సరాలుగా (Five Years) ప్రేమ (Love) పేరుతో అతడు ఆ యువతిని లొంగదీసుకున్నాడు. చివరకు ఆ యువతిని ఎనిమిది నెలల గర్భవతిని (Pregnant) చేశాడు. కానీ అతడు వేరే మహిళతో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె తనకు న్యాయం చేయాలని అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. దీంతో ఆందోళన చేపట్టిన యవతిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు. రెండు రోజులు అతడు ఆ మహిళతో పాటే ఉండి.. తర్వాత ఆమెకు చెప్పకుండా వెళ్లిపోయాడు.

    ఓ ఆటోలో ముగ్గురు తాగుబోతులు.. నిర్మాణుష్య ప్రాంతం.. కల్లు తాగిన వివాహిత.. చివరకు ఏం జరిగిందంటే..


    దీంతో ఆ మహిళ ప్రియుడి ఇంటి మందు మళ్లీ ఆందోళన చేపట్టింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ (Boduppal) శ్రీసాయిరాం నగర్‌ (Sri Sai Nagar) లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం (Janagama) జిల్లాకు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ (Thati konda) గ్రామానికి చెందిన ప్రణీతకు (Praneetha) గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

    Pregnant Women: రైల్వే స్టేషన్ వద్ద నొప్పులతో గర్భిణి.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది..


    ఇలా ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా అతడు వేరే మహిళను కూడా సదరు యువతికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది.

    Shocking Incident: ఆ మహిళ ఆటో కోసం ఎదురు చూస్తోంది.. గమనించిన ముగ్గురు తాగుబోతులు ఆమెను.. బలవంతంగా..


    తనకు న్యాయం చేయాలంటూ ప్రియురాలు గట్టిగా నిలదీసింది. దీంతో అతడు ఆమెను సముదాయించి ఆ ఆందోళనను విరమింపజేశాడు. తెల్లారి ఆ మహిళను అక్కడ నుంచి మిర్యాలగూడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ రూంలో ఆమెను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. అంతలోనే తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుంచి ఇంటికి వచ్చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్‌ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారని వాపోయింది.

    Shocking Incident: చెప్పేవి నీతులు.. చేసివి నీచపనులు.. అక్కాచెల్లెళ్లు ఉన్న ఇంటికి వెళ్లి ఈ కానిస్టేబుల్..


    తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్ సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime news, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు