Home /News /telangana /

Robbery: దేవుడిపై పగ.. ఆలయాల్లో చోరీలు.. అసలు ఏం జరిగింది..

Robbery: దేవుడిపై పగ.. ఆలయాల్లో చోరీలు.. అసలు ఏం జరిగింది..

ప్రతీకాత్మక చిత్రం (Image credit : Youtube)

ప్రతీకాత్మక చిత్రం (Image credit : Youtube)

Robbery: తనకు డబ్బులు సంపాదించే మార్గం చూపించడం లేదంటూ ఓ ప్రబుద్దుడు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. గుడిలో దొంగతనం చేసి బాగా సంపాదించిన తర్వాత మళ్లీ దేవుడికే ఇచ్చేస్తే తప్పులేదనేది అతడి నమ్మకం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన బాలాజీ కుమారుడు మూలే సంతోష్‌ అలియాస్‌ రవి (21) చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. అతడు చిక్కడపల్లిలో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. నీట్‌ రాసి డాక్టర్‌ కావాలని కలలుగన్నాడు. గత ఏడాది నీట్‌ పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. దీంతో కోచింగ్‌ తీసుకోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో డబ్బులు ఇంట్లో అడగలేక పోయాడు. డబ్బులు సంపాదించే మార్గం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఆలయాల్లో చోరీలు చేసి తరువాత వీలున్నపుడు ఆలయంలో డబ్బలు చెల్లించాలని అనుకున్నాడు. జనవరి నుంచి ఐదు నెలల్లోనే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిల్లో ఉండే 7 దేవాలయాల్లో హుండీలను పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు.

    ఈ నెల 14న సికింద్రాబాద్‌ గణపతి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. సుమారు రూ.80 వేల వరకు హుండీలో ఉండే నగదును దొంగిలించి తప్పించుకుని తిరుగుతూ గోపాలపురం పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ. 74 వేల నగదును స్వాధీనం చేసుని రిమాండ్‌కు తరలించారు. అతడిని పోలీసలు విచారించగా ఎనిమిది ఆలయాల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులకు అతడు విచారణలో చుక్కలు చూపించినట్లు తెలిసింది.

    తాను చేసింది నేరమే కాదని నన్నెట్లా అరెస్టు చేస్తారని పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడు. దొంగతనం చేసి డబ్బులు తీసుకెళ్లి.. మళ్లీ అదే హుండీలో వేస్తాను కాబట్టి తాను చేసింది తప్పే కాదన్నట్లు చెప్పాడు. దేవుడి డబ్బు తీసుకున్నా ఆయనకే ఇచ్చేస్తా ఇందులో తప్పెక్కడిది అంటూ వారినే ప్రశ్నిస్తూ విచారణలో ముప్పుతిప్పలు పెట్టాడు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Hyderabad, Robbery, Telangana, Telangana crime news, Temple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు