హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు..ప్రియురాలు దక్కదని యువకుడు ఏం చేశాడంటే?

Hyderabad: ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు..ప్రియురాలు దక్కదని యువకుడు ఏం చేశాడంటే?

దారుణం

దారుణం

ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ అనేది రెండక్షరాల పదం మాత్రమే కాదు. రెండు స్వచ్ఛమైన మనసుల కలయిక. అయితే ఈ ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ప్రేమించిన అమ్మాయి తరువాతే ఎవరైనా, ఇంకేదైనా అనే ఫీలింగ్ ప్రేమికుల్లో ఉంటుంది. ఈ  ప్రేమల్లో కొన్ని విజయతీరాలకు చేరగా..మరికొన్ని అర్ధాంతరంగా మధ్యలోనే విషాదాంతంగా మిగిలిపోతాయి. పెద్దలు ఒప్పుకోలేదని కొన్ని ప్రేమ జంటలు లేచిపోయి పెళ్లి చేసుకున్న సందర్భాలెన్నో. ఇక ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తనువు చాలించిన ప్రేమికులు కూడా ఉన్నారు. ఇక ప్రియురాలి కోసం హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ అనేది రెండక్షరాల పదం మాత్రమే కాదు. రెండు స్వచ్ఛమైన మనసుల కలయిక. అయితే ఈ ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ప్రేమించిన అమ్మాయి తరువాతే ఎవరైనా, ఇంకేదైనా అనే ఫీలింగ్ ప్రేమికుల్లో ఉంటుంది. ఈ  ప్రేమల్లో కొన్ని విజయతీరాలకు చేరగా..మరికొన్ని అర్ధాంతరంగా మధ్యలోనే విషాదాంతంగా మిగిలిపోతాయి. పెద్దలు ఒప్పుకోలేదని కొన్ని ప్రేమ జంటలు లేచిపోయి పెళ్లి చేసుకున్న సందర్భాలెన్నో. ఇక ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తనువు చాలించిన ప్రేమికులు కూడా ఉన్నారు. ఇక ప్రియురాలి కోసం హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.

Hyderabad: రోడ్డుపక్కన చిన్న హోటల్.. సగం ధరలకే చికెన్, మటన్.. టేస్ట్ మామూలుగా ఉండదు

ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. వారిద్దరు కూడా ఒకే కాలేజీకి చెందిన స్నేహితులు. దీనితో వీరిమధ్య విబేధాలు వచ్చాయి.ప్రియురాలు తనకు దక్కదేమోనన్న ఉద్దేశ్యంతో యువకుడిని చంపాలని ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం అతడిని చంపి కటకటాలపాలయ్యాడు. యువకుని హత్యతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక అమ్మాయి కోసం దారుణానికి పాల్పడ్డ యువకుడు జైలుపాలయ్యాడు.

పేదింటి బిడ్డ కల నెరవేరిన వేళ..జిమ్నాస్టిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన స్నేహ..!

నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్, హరిహర అనే ఇద్దరు యువకులు స్నేహితులు. వీరిద్దరూ అదే యూనివర్సిటీకి చెందిన ఓ యువతిని ప్రేమించారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చాయి. ఏదేమైనా ప్రియురాలిని దక్కించుకోవాలని హరిహర అనుకున్నాడు. దీనితో తమకు అడ్డుగా ఉన్న నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దీనికై పథకం పన్నాడు. ఒకరోజు హరిహర నవీన్ కు ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని హైదరాబాద్ రావాలన్నాడు. హరిహర ప్లాన్ గురించి తెలియని నవీన్ హైదరాబాద్ కు వెళ్ళాడు. అక్కడ ఓ రూమ్ లో ఇద్దరు పార్టీ చేసుకున్నారు.

అనంతరం వీరి మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో నవీన్ తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇక ఆ తరువాత నవీన్ ను హరిహర కొట్టి చంపేశాడు. అనంతరం బాడీని హైదరాబాద్-విజయవాడ హైవేపై పడేశాడు. అయితే  4 రోజులుగా నవీన్ కాలేజీకి రావడం లేదని తల్లిదండ్రులకు స్టాఫ్ ఫోన్ చేశారు. దీనితో అనుమానం వచ్చిన నవీన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కాలేజీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. హరిహర ఫోన్ 4 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే అదే రోజు రాత్రి హరిహర పోలీసులకు లొంగిపోయాడు. తను ప్రేమించిన అమ్మాయి దక్కదనే నవీన్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈనెల 17న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

First published:

Tags: Crime, Hyderabad, Lovers, Murder, Telangana