HYDERABAD A YOUNG MAN BRUTALLY KILLED HIS EMPLOYER AFTER HE GOT INTO A FIGHT OVER ASKING FOR SALARY MONEY INCIDENT HAPPENED IN HYDERABAD PRV
Brutally murder: పని చేసినందుకు డబ్బులివ్వలేదని యజమానిని చంపేసిన యువకుడు.. హైదరాబాద్‌లో ఘటన
ప్రతీకాత్మక చిత్రం
క్షణికావేశం ఓ మనిషిని ఎంతటి దారుణానికి అయినా ఉసిగొల్పుతుంది. జీతం డబ్బుల విషయంలో యజమాని గొడవకు దిగడంతో విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు యజమానిని కిరాతకంగా హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
క్షణికావేశం ఓ మనిషిని ఎంతటి దారుణానికి అయినా ఉసిగొల్పుతుంది. జీతం డబ్బుల విషయంలో యజమాని (Employer) గొడవకు దిగడంతో విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు యజమానిని కిరాతకంగా హతమార్చిన (Brutally murder) ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన వీరేందర్ కుమార్ సేత్ (55) భార్య హేమలతతో కలిసి 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి చింతల్ కల్పన సొసైటీలో ఉంటున్నాడు. గత 7 ఏళ్ల క్రితం వీరేందర్ చింతల్ గణేష్‌నగర్ బస్టాప్ పక్క సందులో బైక్ మెకానిక్ దుకాణం (Bike mechanic shop) నిర్వహిస్తున్నాడు. వీరేందర్ వద్ద ఇద్దరు యువకులు పని చేస్తుండగా నెల రోజుల క్రితం గాజులరామారం రోడామేస్త్రీనగర్‌కు చెందిన మరో యువకుడు సయ్యద్ జహీర్ (26) పనికి కుదిరాడు. ఇద్దరు యువకులు సెలవుల్లో ఉండగా గురువారం షాపులో వీరేందర్, జహీర్ ఇద్దరే ఉన్నారు. రాత్రి 10 గంటలకు వీరేందర్ బార్లో మద్యం సేవిస్తుండగా (taking Alcohol) జహీర్ జీతం డబ్బులు ఇవ్వాలని యజమాని వీరేందర్‌ను అడిగాడు. అయితే వీరేందర్ మద్యం మత్తులో జహీర్‌తో మాట్లాడాడు. అసలే కోపంగా ఉన్న జహీర్ వీరేందర్తో ఆగ్రహంగానే మాట్లాడాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం (Fight) చోటు చేసుకుంది.
ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన జహీర్ ఒక్కసారిగా వీరేందర్ (Virender) తలపై ఇనుప వస్తువుతో దాడి చేశాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి పలుమార్లు దాడికి పాల్పడి వీరేందర్‌ను హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్ది సేపటికి బైక్ కోసం దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి వీరేందర్ రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.
వెంటనే అక్కడకు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వీరేందర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సాంకేతిక ఆధారాలతో నిందితుడు జహీర్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
పట్నాలో ఇలాంటి ఘటనే..
కాగా, పట్నాలో ఇలాగే జీతం విషయంలో గొడవ జరిగి ఒకరి మృతికి దారితీసింది. మూడు నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు ఇక పనిచేయనని యజమానికి చెప్పాడు. తనకు ఇవ్వవలసిన జీతాన్ని చెల్లించడని అడిగినందుకు.. ఆ యజమాని అతడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో జరిగింది. పట్నా నగరంలోని ఒక మొబైల్ ఫోన్ షాపులో వికాస్ అనే యువకుడు పనిచేసేవాడు. గత మూడు నెలలుగా జీతం ఇవ్వనందుకు పనిమానేస్తున్నానని యజమాని ఆదర్ష్ కుమార్‌తో చెప్పాడు. షాపులో వికాస్‌తో పాటు మరో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు.
కానీ వికాస్ కొత్త కావడంతో అతనికి మాత్రమే జీతం ఇవ్వలేదు. దీంతో వికాస్ తనకు జీతం ఇవ్వాలని యజమానిని అడిగాడు. అప్పుడు యజమాని వికాస్‌కు కొన్ని డబ్బులు ఇచ్చి ఒక డబ్బాలో పెట్రోల్ తీసుకురమన్నాడు. ఆ తరువాత షాపులో పనిచేసే మరో కుర్రాడిని వికాస్‌ని వెంబడించమని యజమాని పంపాడు. వికాస్ పెట్రోల్ తీసుకొని తిరిగి వస్తున్న సమయంలో షాపులో పనిచేసే మరో కుర్రాడు.. అతనిపై దాడి చేశాడు. ఆ తరువాత పెట్రోల్ వికాస్‌పై పోసి నిప్పు పెట్టాడు. దీంతో వికాస్ శరీరం పూర్తిగా కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వికాస్ మరణించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.