corona : గాంధీ ఆసుపత్రికి చేతులెత్తి మొక్కిన మహిళ...వైరల్ అవుతున్న ఫోటో

గాంధీ ఆసుపత్రికి చేతులెత్తి మొక్కిన మహిళ

Viral photo : గాంధీ ఆసుపత్రి అంటే ప్రాణాలు తీసేదే కాదు..ప్రాణాలు పోసేది కూడా..అందుకే ఓ మహిళ తన ప్రాణాలు కాపాడిన గాంధీ ఆసుపత్రికి రెండు చేతులెత్తి మొక్కింది..దీంతో ఆఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.

  • Share this:
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి అంటే సగటు రోగికి ఒంట్లో వణుకు పుడుతుంది. అక్కడికి చికిత్సకోసం వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతారనే అపవాదు ఉంది. అయితే ఇందుకు వేరే కారణాలు ఉన్నా..గత సంవత్సరం నుండి గాంధీలో చికిత్స పోందుతూ చనిపోయిన వారికంటే బతికి బట్టకట్టిన వారు కూడ ఉన్నారు. అయితే సామాన్యునికి న్యాయం చేయాలనే లక్ష్యంతో గాంధీపై ఎప్పుడు ఏదో ఓక వ్యతిరేక వార్తలు వస్తునే ఉంటాయి.

అయితే ఇందుకు విరుద్దంగా , గాంధీపై ఉండే అభిప్రాయం తప్పు అనేట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గాంధీపై వ్యతిరేక భావం ఉన్నవాళ్లను ఈ ఫోటో కాస్త ఆలోచింప చేస్తోంది. అయితే ఇంతకి ఈ ఫోటోకు ఉన్న ప్రత్యేకత ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. అందరు గాంధీపై దుమ్మెత్తి పోసే సమయంలో అది కూడ కరోనాతో పోరాటం చేసే సమయంలో ఈ ఫోటో చాలామందిని అలోచింప చేస్తోంది. ఎందుకంటే చాలమంది చీదరించుకునే గాంధీ ఆసుపత్రికి ఈ మహిళ రెండు చేతుల దండం పెట్టడం..దీంతో ఈ ఫోటో వైరల్ అవుతోంది.

ఇక వివరాల్లోకి వెళితే మంచిర్యాలకు జిల్లాకు చెందిన ఓ మహిళ గత కొద్ది రోజులుగా కరోనా వ్యాధికి గురై గాంధీలో చికిత్స పోందింది. గాంధీ వైద్యుల చికిత్స తిరిగి ఆమె మామాలు మనిషి అయింది. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఆ మహిళ తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో గాంధీకి దండం పెట్టి వెళ్లిపోయింది. ఇంకేముంది మహిళ దండం పెడుతుండగా ఎవరో మహానుభావుడు ఫోటో తీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్ గా మారింది. మొత్తం మహిళ ఫోటోతో గాంధీ ఆసుపత్రి ఓకింత మంచి ఇమేజ్ మూటగట్టుకుంటుంది.
Published by:yveerash yveerash
First published: